news18-telugu
Updated: November 24, 2020, 1:58 PM IST
మోనాల్‌తో అభిజీత్ Photo : Star Maa
బిగ్ బాస్ హౌజ్‌లో ప్రస్తుతం 12వ వారం నడుస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అది లక్ కి సంబంధించినది. గార్డెన్ ఏరియాలో ఉన్న టోపీలలో ఎర్రని కలర్స్ వచ్చిన వారు నామినేట్ అయినట్లు, గ్రీన్ కలర్ వచ్చిన వారు సేవ్ అయినట్లుగా బిగ్ బాస్ టాస్క్ డిజైన్ చేశారు. దీంతో సోయెల్, మోనాల్ ఇద్దరు గ్రీన్ కలర్స్ తో సేవ్ అయ్యారు. అఖిల్, అవినాష్, ఆరియానా, అభిజిత్ నామినేట్ అయ్యారు. ఆ తరువాత బిగ్ బాస్ స్వాప్ చేసుకునేందుకు ఒక అవకాశం ఇచ్చినా సోహెల్, మోనాల్ ఇద్దరూ తాము నామినేట్ కామని తెగేసి చెప్పారు. ఇక కెప్టెన్ హోదాలో హారికను డిసైడ్ చేయమంటే ఆమె మోనాల్ ని నామినేట్ చేసి అభిజిత్ ని సేవ్ చేసింది. ఇక తాజాగా ఈరోజు ఎపిసోడ్‌కు సంబందించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ ప్రోమోలో ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. అఖిల్ మరో ఇంటి సభ్యుడు అభిజీత్ గురించి మాట్లాడితే.. మోనాల్ మాత్రం అఖిల్ గురించి మాట్లాడింది. అఖిల్ ఎంతో జెన్యూన్‌గా ఉండేవాడని.. అతను ఎందుకు ఇలా మారడని హారికకు చెబుతోంది. ఇక అభిజీత్ మోనాల్‌తో గార్డెన్ ఏరియాలో మాట్లాడుతూ.. మా నాన్నకు నువ్వు నచ్చావట.. అంటూ అశ్చర్యపోతూ చెప్పాడు. ఇక అవినాష్ అరియానాను ఉద్దేశిస్తూ ఏడ్వకు ఏడిస్తే ఇక్కడ ఎం జరుగదు. అసలు టాస్క్‌లు చేయడం వేస్టు అంటూ వాపోయాడు అవినాష్. ఇక అంతటితో ఈ తాజా ఎపిసోడ్‌కు సంబందించిన ప్రోమో ఎండ్ అయ్యింది. ఇక నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే.. మోనాల్ తన లక్ కొద్ది సేవ్ అయినా కూడా హారిక రూపంలో మళ్లీ నామినేషన్లోకి వెళ్లింది.
దీంతో ఈ వారం నామినేషన్లో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్‌లు ఉన్నారు. చూడాలి మరి మరో సారి మోనాల్ సేవ్ కానుందా... లేదా ఈ సారి మోనాల్ ఇంటి బాట పట్టనుందా.. ఈసారి జనాలు మోనాల్‌ను ఆదుకుంటారా లేక అంతా అనుకుంటున్నట్లుగా బిగ్ బాస్ సేవ్ చేస్తాడా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈసారి అందరూ స్ట్రాంగ్ క్యాడిడేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి మోనాల్ హౌజ్ నుంచి బయటకు వెళ్ళడం ఖాయమని అంటున్నారు నెటిజన్స్.
Published by:
Suresh Rachamalla
First published:
November 24, 2020, 1:58 PM IST