HOME »NEWS »MOVIE »bigg boss telugu 4 abhijeeth talks about hug with harika says i am not getting hugs these days sr

Bigg Boss Telugu 4 : ఎన్నిరోజులైంది నాకు హగ్ ఇచ్చి.. హారికపై అలిగిన అభిజీత్..

Bigg Boss Telugu 4 : ఎన్నిరోజులైంది నాకు హగ్ ఇచ్చి.. హారికపై అలిగిన అభిజీత్..
అభిజీత్, హారిక Photo : Instagram

Bigg Boss Telugu 4 : తెలుగ బిగ్ బాస్ షో ప్రస్తుతం పదవవారం నడుస్తోంది. కాగా ఈ తాజా ఎపిసోడ్‌లో అభిజీత్ హారికపై అలుగుతూ ఎన్ని రోజులైంది నాకు నువ్వు హగ్ ఇచ్చి.. అని అనడంతో..

  • Share this:
    Bigg Boss Telugu 4 : తెలుగ బిగ్ బాస్ షో ప్రస్తుతం పదవవారం నడుస్తోంది. ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ రద్దు తరువాత మెహబూబ్‌, అఖిల్‌ పంచాయితీ మీద అభిజిత్‌ సెటైర్లు వేశాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, మంచిగా ఆడొచ్చు కదా అంటూ లాస్య, హారికలతో ముచ్చట్లు పెట్టాడు. ఈ క్రమంలో హారికతో హగ్‌ టాపిక్‌ని తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా అభిజీత్ హారికతో మాట్లాడుతూ.. పోయి అఖిల్‌కి హగ్గులిచ్చుకో పో అంటూ మండిమడ్డాడు. అభిజీత్ మాట్లాడుతూ నాకు నువ్వు హగ్‌ ఇచ్చి ఎన్ని రోజులైతుందో తెలుసా? అంటూ అభిజీత్ హారికపై అలిగాడు. దీంతో హారిక స్పందిస్తూ  ఈరోజు పొద్దున్నే కదా ఇచ్చాను అంది. నేను ఇప్పటికిప్పుడు హగ్గిస్తే కుర్చీలో నుంచి కింద పడిపోతావు అంటూ మాట్లాడింది హారిక. దీనికి అభిజీత్ స్పందిస్తూ.. ఎప్పుడో ఏదో అని, దాన్ని కవర్ చేసేందుకు హగ్గిచ్చావే కానీ సొంతంగా ఎప్పుడైనా హగ్గిచ్చావా అంటూ.. కాసేపటి వరకు హగ్‌ల గురించి మాట్లాడుకోవడం చూసి.. అక్కడి నుండి లాస్య వెళ్లిపోయింది.

    Bigg Boss Telugu 4 news, bhijeeth, dethadi harika, Dethadi harika hug, bigg boss telugu 4,bigg boss 4 details telugu, bigg boss 4 telugu latest, బిగ్ బాస్ 4 తెలుగు, యాంకర్ లాస్య, అభిజీత్, హారిక
    అభిజీత్, హారిక Photo : Instagram




    ఇక బిగ్‌ బాస్‌ ఇంటికి ఈ వారం కెప్టెన్‌ కోసం ఆఖరి బంతి అనే టాస్క్‌ ను ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్‌ లో భాగంగా ఇంటి సభ్యులు అంతా కూడా కెప్టెన్సీ పోటీలో పాల్గొనగా.. చివర్లో అఖిల్‌, మెహబూబ్‌, సోహెల్‌ లు మిగిలారు. వీరిలో ఒకరు తప్పుకోవాల్సి ఉండగా.. ఒకసారి కెప్టెన్‌ అయ్యాను కనుక నేను తప్పుకుంటాను అంటూ సోహెల్ సైడ్ అయ్యాడు. దాంతో అఖిల్‌, మెహబూబ్‌‌లు నేనంటే నీను అంటూ కెప్టెన్ కోసం చాలా సేపు వాదించుకున్నారు. ఎవరో ఒకరు కాంప్రమైజ్‌ అవ్వాలంటూ సోహెల్‌ చెప్పినా వినలేదు. ఇక చివరికి బిగ్‌ బాస్‌ అనౌన్స్‌ మెంట్‌ చేస్తూ పదవ వారం గడుస్తున్న ఎవరికి కెప్టెన్సీపై ఆసక్తి లేనట్లుంది. ఎవరు కూడా ఇమ్యూనిటీ కోరుకుంటున్నట్లుగా అనిపించలేదు. బిగ్‌బాస్ ఆదేశాలు లెక్క చేయకుండా వ్యవహరించారు అంటూ ఈ వారం కెప్టెన్‌ ఎవరు ఉండటం లేదు తెలిపాడు. దీంతో ఈ వారం కెప్టెన్సీ ఎవరికి దక్కలేదు.
    Published by:Suresh Rachamalla
    First published:November 11, 2020, 09:46 IST

    टॉप स्टोरीज