Bigg Boss Telugu 4: కొట్టుకున్న అఖిల్, మెహబూబ్.. మోనాలే కారణమా?

Bigg Boss Telugu 4: ఈ వారం నామినేషన్‌లో అభిజీత్, దివి, మోనాల్, నోయెల్, అరియానా, అవినాష్ ఉన్నారు. ఇప్పటి వరకు ఇంటి నుంచి ఏడుగురు వెళ్లిపోయారు.

news18-telugu
Updated: October 23, 2020, 6:35 PM IST
Bigg Boss Telugu 4:  కొట్టుకున్న అఖిల్, మెహబూబ్.. మోనాలే కారణమా?
మూవీ టాస్క్‌లో అఖిల్, మెహబూబ్ ఫైట్ (Image:StarMAA)
  • Share this:
Bigg Boss Telugu 4: ఐపీఎల్ సందడి వేళ బిగ్ బాస్ కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. టాస్క్‌ల్లో కొత్తదనం లేదని.. ఏ మాత్రం పసలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఏటా నిర్వహించే రొటీన్ టాస్క్‌లనే ఇస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. ఐతే ఎప్పటిలానే ఈసారి కూడా హౌస్‌మేట్స్‌కు సినిమా టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఇంటి సభ్యులంతా బిగ్‌బాస్ బ్లాక్‌బస్టర్ సినిమా టేకింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడులైన ప్రోమోలో అభిజిత్, అఖిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హౌస్‌లో వీరిద్దరు బద్ధ శత్రువులుగా ఉంటూ వస్తున్నారు. మోనాల్‌తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయంలో అఖిల్, అభిజీత్‌కు పడడం లేదు. ఐతే తొలిసారి వీరిద్దరు కలివిడిగా ఉంటూ.. నవ్వుతూ కనిపించారు. అంతేకాదు ఇద్దరూ కలిసి మోనాల్ గజ్జర్‌పై సెటైర్లు వేశారు.

బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా టాస్క్‌లో దర్శకుడి అవతారం ఎత్తాడు అభిజీత్. హీరోగా అఖిల్, హీరోయిన్‌గా మోనాల్ నటిస్తున్నారు. మోనాల్‌ను చూసి హీరోయిన్ ఇలా ఉందేంటి అని సెటైర్ వేశాడు అభిజీత్. ఆమెను పరిచయం చేస్తూ చేతులు కలిపిన అఖిల్.. మేకప్ లేకుంటే ఇలానే ఉంటుందని పంచ్‌లు వేశాడు. ఇక నోయెల్ కెమెరామెన్‌, దివి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కొరియాగ్రాఫర్‌గా పనిచేస్తున్న అమ్మ రాజశేఖర్.. హారికకు డాన్స్ నేర్పించాడు. చిత్రంలో అరియానా, అవినాష్ బావా మ‌ర‌ద‌ళ్లుగా నటిస్తున్నారు. నీ ముఖాన్ని అద్దంలో చూసుకో అని అనడంతో చిన్నబోతాడు అవినాష్. నోయెల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. సోహైల్‌ను ఎవరు మీరు అని.. మోనాల్ అడగడంతో.. ఐటమ్ రాజా అని చెప్పి నవ్వులు పూయిస్తుంది లాస్య. ప్రోమో చూస్తుంటే ఇవాళ్టి ఎపిసోడ్‌లో కామెడీ బాగా పండినట్లే కనిపిస్తోంది.



మరొక ప్రోమోలో.. మెహబూబ్‌ని కూడా విలన్‌గా చూపించారు. నన్ను పంజరంలో పెట్టి ప్రేమ పావురాలు బాగానే ప్రేమించుకుంటున్నాయని అతడు డైలాగ్ చెబుతాడు. అనంతరం అఖిల్, మెహబూబ్ మధ్య ఫైట్ జరుగుతుంది. ఇద్దరు కొట్టుకుంటారు. అంతేకాదు అఖిల్, మోనాల్ రొమాన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోంది.


కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో అవినాష్, సోహెల్, మెహబూబ్, అఖిల్, అభిజీత్, నోయెల్, అమ్మ రాజశేఖర్, దివి, లాస్య, హారిక, మోనాల్, అరియానా ఉన్నారు. ఈ వారం నామినేషన్‌లో అభిజీత్, దివి, మోనాల్, నోయెల్, అరియానా, అవినాష్ ఉన్నారు. ఇప్పటి వరకు ఇంటి నుంచి ఏడుగురు వెళ్లిపోయారు. మొదటి వారం సూర్య కిరణ్, రెండో వారం కరాటే కల్యాణి, మూడో వారం దేవి నాగవల్లి, నాలుగో వారం స్వాతి, ఐదో వారం గంగవ్వ, సుజాత, ఆరోవారం కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది.
Published by: Shiva Kumar Addula
First published: October 23, 2020, 6:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading