Bigg Boss Telugu 4 : 9th Week Nominations : హోరా హోరీగా నామినేషన్స్.. మోనాల్‌ను మట్టిలో ముంచిన సోహైల్..

Bigg Boss Telugu 4 : 9th Week Nominations : సోమవారం మొదలైన తొమ్మిదివారం నామినేషన్స్ పర్వం మంగళవారం నాడు కూడా కొనసాగింది.

news18-telugu
Updated: November 4, 2020, 9:38 AM IST
Bigg Boss Telugu 4 : 9th Week Nominations : హోరా హోరీగా నామినేషన్స్.. మోనాల్‌ను మట్టిలో ముంచిన సోహైల్..
మోనాల్, అఖిల్ Photo : Star maa
  • Share this:
Bigg Boss Telugu 4 : 9th Week Nominations : సోమవారం మొదలైన తొమ్మిదివారం నామినేషన్స్ పర్వం మంగళవారం నాడు కూడా కొనసాగింది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో అరియానా సోహైల్‌ను నామినేట్ చేయగా.. సోహైల్ అభిజీత్‌ను నామినేట్ చేశాడు. మరో గుడ్డును మోనాల్‌ను నామినేట్ చేశాడు. ఇక ఆ తర్వాత అవినాష్‌కు అవకాశం రాగా అతను కూడా అభిజీత్‌ను నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య కొంత వగ్వాదం మొదలైంది. ఆ తర్వాత అవినాష్ హారికను నామినేట్ చేశాడు. ఇక ఇదే తంతూ మంగళ వారం కూడా నడిచింది. అవినాష్‌ని నామినేట్ చేసిన అభి, రెండో గుడ్డును మాస్టర్‌ తలపై కొట్టాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఓ రేంజ్‌లో వాగ్వాదం జరిగింది. నామినేట్ చేసిన అభిజీత్ మాస్టర్‌ను ఉద్దేశిస్తూ.. మీరు ఎదుటి వాళ్లని అంటారు కానీ.. తిరిగి అంటే రిసీవ్ చేసుకోలేరు.. నోయల్ ఎవర్నో నామినేట్ చేస్తే మీరు అరగంట నిలబెట్టి అతనికి క్లాస్ పీకారు.. అనగానే మాస్టర్ స్పందిస్తూ.. ఒంటికాలిపై నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని అసలు వాడెవడు నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి.. అంటూ తీవ్రంగా మండి పడ్డాడు. ఇక ఆ తర్వాత దేత్తడి హారిక వంతు వచ్చింది. ఆమె మొదటి గుడ్డు అవినాష్‌పై, రెండో గుడ్డును అమ్మ రాజశేఖర్‌పై కొట్టి ఇద్దర్ని నామినేట్ చేసింది.

ఆ తరువాత లాస్య వంతు రాగ ఆమె అవినాష్‌ను, మోనాల్‌ను నామినేట్ చేసింది. ఇక మోనాల్ వంతు రాగా.. ఆమె మొదటి గుడ్డును సొహైల్‌పై, రెండో గుడ్డును లాస్యపై కొట్టి సోహైల్‌ను లాస్యను నామినేట్ చేసింది. ఇక అమ్మా రాజశేఖర్.. మొదటి గుడ్డు అభిజిత్‌పై తలపై.. రెండో గుడ్డును అఖిల్‌ తలపై కొట్టాడు. ఆ తరువాత మెహబూబ్‌కు నామినేషన్ అవకాశం రాగా.. అతను మొదటి గుడ్డును హారిక తలపై.. రెండో గుడ్డును అవినాష్‌ తలపై పగలగొట్టి ఇద్దర్ని నామినేట్ చేశాడు. ఇక చివరగా అఖిల్‌ మొదటి గుడ్డును అమ్మా రాజశేఖర్ తలపై కొట్టి, రెండో గుడ్డును తన ప్రియురాలు మోనాల్‌ తలపై కొట్టాడు. అలా గొడవలు, వాగ్వాదాలతో నామినేషన్‌ల పర్వం ముగిసింది.

Bigg Boss Telugu 4 news, 9th Week Nominations , akhil, monal, nagarjuna, bigg boss telugu 4 latest promo, బిగ్ బాస్ తెలుగు న్యూస్,
మోనాల్, సోహైల్ Photo : star maa


ఇక ఆ తర్వాత నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. నామినేషన్‌లో ఉన్న అయిదుగురు టీ స్టాండ్‌ పై తల పెట్టి ఉండగా వారిని రకరకాల ప్రయత్నాలతో వారిని కదిలించేందుకు ఇతర సభ్యులు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ టీ స్టాండ్ పై తలపెట్టడం తర్వాత మట్టి పోయడం, ఐస్‌ క్యూబ్స్‌ వేయడం, గడ్డితో కెలకడం, గుడ్లు కొట్టడం ఇలా రకరకాలుగా చేశారు. దీంతో సోహైల్ మోనాల్‌పై మట్టితో కూడిన నీళ్లను పోశాడు. దీంతో అఖిల్ సోహైల్‌లు వివాదానికి దిగారు. ఇక అభిజీత్‌ చివరి నిమిషంలో ఒక లైన్‌ అంటూ ఉంటుంది. దాన్ని క్రాస్‌ చేసేలా ఇది ఉంది. అందుకే నేను తప్పుకుంటున్నాను అంటూ చెప్పి వెళ్లి పోయాడు. అభిజీత్ ఆ టాస్క్ నుంచి తప్పుకున్న తర్వాత.. హారిక చివరి వరకు ఉండలేక వచ్చేసింది. ఆ తర్వాత ముగ్గురులో ఎవరు కదలక పోవడంతో ఎవరికి ఇమ్యూనిటీ దక్కలేదు. దీంతో ఈ వారం అయిదుగురు ఎలిమినేషన్‌ లో ఉన్నారు అంటూ ప్రకటించాడు బిగ్ బాస్. ఈ వారంలో నామినేషన్‌లో ఉన్న వారిలో.. అభిజిత్‌, హారిక, అమ్మ రాజశేఖర్‌, అవినాష్‌ మోనాల్‌‌లు ఉండగా.. ఈ ఐదుగురిలో అమ్మ రాజశేఖర్ లేదా మోనాల్‌ ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
Published by: Suresh Rachamalla
First published: November 4, 2020, 9:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading