పునర్నవికి కల్లుకుండ, శ్రీముఖికి మజ్జిగ కుండ : రాహుల్ సిప్లిగంజ్

పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ  షో మూడవ సీజన్‌లో  పాల్గొని యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.

news18-telugu
Updated: November 20, 2019, 12:07 PM IST
పునర్నవికి కల్లుకుండ, శ్రీముఖికి మజ్జిగ కుండ : రాహుల్ సిప్లిగంజ్
Instagram
  • Share this:
పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ  షో మూడవ సీజన్‌లో  పాల్గొని యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఈ జంట తెలుగు ప్రేక్షకుల్నీ భాగానే అలరించింది. హౌజ్‌లో ఉన్నంత కాలం రాహుల్‌, పున్నులు సాన్నిహిత్యంగా మెలగడం, వీరి కెమిస్ట్రీని తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయడంతో ఇరువురికి యూత్‌లో ఎనలేని పాపులారిటీ వచ్చింది. చాలా మంది వ్యువర్స్ కేవలం ఈ జంట కెమిస్ట్రీని చూడటానికి ఇష్ట పడి బిగ్ బాస్ షో చూసేవారు. విషయం ఎలా మారిదంటే రాహుల్, పున్ను ప్రేమించుకుంటున్నారని.. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు రాగానే ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటారని  సోషల్ మీడియాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ఇరువురు మీడియా చానల్స్‌కు, పలు యూట్యూబ్ చానల్స్‌‌తో మాట్లాడుతూ.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. అంతేకాని ప్రేమికులం కాదని చాలా సార్లు స్పష్టం చేశారు.  ఏదీ ఏమైనా ఈ జంట ఎక్కడికి వెళ్లినా ఇదే రచ్చ జరుగుతోంది. కాగా తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యే 'ఆలీతో సరదాగా'లో పున్ను, రాహుల్ సందడి చేశారు.

ఆ ప్రోగ్రామ్‌లో కమెడియన్ ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు చెబుతూ అలరించారు. ఈ సందర్బంగా రాహుల్‌ను ఉద్దేశించి ఆలీ మాట్లాడుతూ.. నీ ఎదురుగా కల్లుకుండ.. మజ్జిగ కుండ ఉంటే శ్రీముఖికి ఏం ఇస్తావు.. పునర్నవికి ఏం ఇస్తావు? అని ప్రశ్నించాడు. దీంతో రాహుల్ ఆ ప్రశ్నకు సమాదానమిస్తూ.. శ్రీముఖికి మజ్జిగ కుండ ఇస్తా. ఎందుకంటే తను కూల్‌ అవ్వాలని కోరుకుంటున్నా.., ఇక మిగిలింది కల్లుకుండే కనుక అది పునర్నవికి ఇస్తానని బదులిచ్చాడు.

పూజా హెగ్డే... అదిరే అందాలు


Published by: Suresh Rachamalla
First published: November 20, 2019, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading