Rahul Sipligunj: రాహుల్ రక్తం చూసి...కన్నీరు మున్నీరు అవుతున్న పునర్నవి...

Rahul Sipligunj: బిగ్ బాస్ సీజన్ మొత్తం మోస్ట్ హాపెనింగ్ కపుల్ గా పేరొందిన వీరిద్దరూ. ఆన్ స్క్రీన్ మీదనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా రొమాన్స్ పండిస్తూ ప్రేక్షకులకు కనువిందు చేశారు. అయితే తాజాగా ఓ పబ్ లో రాహుల్ సిప్లిగంజ్ పై అతి దారుణమైన దాడి ఘటనలో రక్త సిక్తమయ్యాడు.

news18-telugu
Updated: March 5, 2020, 2:41 PM IST
Rahul Sipligunj: రాహుల్ రక్తం చూసి...కన్నీరు మున్నీరు అవుతున్న పునర్నవి...
గాయపడ్డ రాహుల్ సిప్లిగంజ్
  • Share this:
Rahul Sipligunj: బిగ్ బాస్ విన్నర్ రాహుల్ పై పబ్ లో జరిగిన దాడిపై పునర్నవి కన్నీరు మున్నీరు అయినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ మొత్తం మోస్ట్ హాపెనింగ్ కపుల్ గా పేరొందిన వీరిద్దరూ. ఆన్ స్క్రీన్ మీదనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా రొమాన్స్ పండిస్తూ ప్రేక్షకులకు కనువిందు చేశారు. అయితే తాజాగా ఓ పబ్ లో రాహుల్ సిప్లిగంజ్ పై అతి దారుణమైన దాడి ఘటనలో రక్త సిక్తమయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే రాహుల్ పై ఇంత ఘోరంగా దాడి జరగడం పట్ల నటి పునర్నవి కన్నీరు మున్నీరు అవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాహుల్‌పై రితేష్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు దాడి చేశారని, ఓ వ్యక్తి బీర్ బాటిల్స్‌తో దాడి చేశారని తెలిపారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో రాహుల్‌‌‌‌ను అక్కడున్న వ్యక్తులు ఢీకొట్టారని...దీంతో మాటా మాటా పెరిగి దాడి చేసుకున్నట్లు సీఐ వివరించారు. పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324, 34 రెడ్‌విత్ కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు. రాహుల్‌కు రితేష్‌రెడ్డితో గతంలో ఉన్న గొడవలపై ఆరా తీస్తున్నామని, ప్రాథమిక విచారణలో అనుకోకుండా ఈ దాడి జరిగినట్లు తేలిందని వెల్లడించారు. రాహుల్‌పై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
First published: March 5, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading