బిగ్ బాస్ అభిమానులకు రాహుల్ గుడ్ న్యూస్..

రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

news18-telugu
Updated: November 22, 2019, 8:53 AM IST
బిగ్ బాస్ అభిమానులకు రాహుల్ గుడ్ న్యూస్..
కేటీఆర్ రాహుల్ సిప్లిగంజ్ (ktr rahul sipligunj)
  • Share this:
రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. దీనికి రాహుల్, పునర్నవితో ప్రేమ వ్యవహారం కూడా.. రాహుల్‌ను నిత్యం వార్తల్లో ఉండేట్టుగా చేసింది. అది అలా ఉంటే రాహుల్ బిగ్ బాస్ విన్నర్‌గా అవ్వడానికి ఓట్లు వేసిన తన అభిమానులకు ఓ బహుమతి ఇవ్వనున్నాడు. ఇదే విషయాన్ని ఆయన ఇంతకు ముందే తన సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాహుల్ మరో అప్‌డేట్‌తో ముందుకు వచ్చాడు. తనను అంతలా ప్రేమించి, ఇంట్లో ఓ వ్యక్తిగా చూసి.. తనను ఆదరించిన అభిమానులకు, ఫ్రెండ్స్‌కు, శ్రేయోభిలాషులకు అదిరిపోయే గిప్ట్ ఇవ్వనున్నానని ప్రకటించాడు. దానికి సంబందించి ఓ డేట్ కూడా ఫిక్స్ చేశాడు. అయితే ఆ గిప్ట్ ఎంటంటే.. రాహుల్ ఈ నెల 25న లైవ్ మ్యూజికల్ కన్సార్ట్‌ను నిర్వహించి.. అందరికి ఫ్రీగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇలా తనకు ఓట్లు వేసిన వారి బుణం తీర్చుకుంటానని తెలిపాడు. అయితే డేట్ ప్రకటించాడు కానీ.. ప్లేస్ మాత్రం త్వరలో ప్రకటిస్తానని తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
View this post on Instagram

Here we go Chichaas!! 🕺🏻🕺🏻


A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on
Published by: Suresh Rachamalla
First published: November 22, 2019, 8:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading