Bigg Boss Telugu 3 : బిగ్ బాస్ తెలుగు చివరి దశకు చేరుకుంది. షో పూర్తి అవ్వడానికి ఇంకా రెండు వారాలే ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి ఇంటి సభ్యల బంధువుల్నీ ఒక్కోక్కర్నిగా పంపిస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగా మొన్నటి ఎపిసోడ్లో వితికా సిస్టర్ రాగా.. నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలీ రెజా భార్య మసుమ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. కాగా ఆమె వచ్చేసరికి ఇంటి సభ్యులందరూ స్లీపింగ్ మోడ్లో ఉన్నారు. అందులో భాగంగా అలీ రెజా కూడా కళ్లు మూసుకొని ఉండగా.. ఆయన భార్య మసుమ అతడి దగ్గరకి వెళ్లి తన ఒడిలో ఆయన తల పెట్టుకొని బోరున ఏడ్వడం మొదలుపెట్టింది.
ఇంతలో బిగ్ బాస్.. స్లీపింగ్ మోడ్ నుండి అలీ రెజాను విడుదల చేయడంతో ఆయన తన భార్య మసుమను ప్రేమగా దగ్గరకి తీసుకొని చెంపపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన భార్యకి బిగ్ బాస్ హౌస్ మొత్తం తిరిగి చూపించాడు అలీ. కొద్ది సేపటికి ఆమె వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికి హౌస్ లోకి శివజ్యోతి భర్త గంగూళీ వచ్చాడు. కాగా శివజ్యోతి తన భర్తను చూసి ఒక్కసారిగా షాక్ గురైంది. అంతేకాకుండా బోరుమంటూ ఏడ్చుకుంటూ తన భర్త దగ్గర వచ్చింది. కొద్ది సేపు మాట్లాడిన శివజ్యోతి భర్త ఆ తర్వత కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయాడు. చివరగా బాబా భాస్కర్ భార్య, ఇద్దరు పిల్లలు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వారితో కాసేపు ముచ్చటించాడు బాబా... అలా తాజా ఎపిసోడ్ ముగిసింది.
Published by:Suresh Rachamalla
First published:October 17, 2019, 12:27 IST