Bigg Boss Telugu 3 | బిగ్ బాస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన కౌశల్ ఆర్మీ...

ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారికి అసలు ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం అటు కంటెస్టెంట్లకు గానీ, ఇటు ప్రేక్షకులకు గానీ తెలియడం లేదు.

news18-telugu
Updated: September 14, 2019, 3:58 PM IST
Bigg Boss Telugu 3 | బిగ్ బాస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన కౌశల్ ఆర్మీ...
బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ (ప్రతీకాత్మక చిత్రం )
  • Share this:
కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 సమయంలో సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు. కౌశల్‌ని విజేతగా నిలిపింది ఈ ఆర్మీనే. కౌశల్ ఆర్మీ దెబ్బకు బిగ్ బాస్ కూడా వణికిపోయిన సందర్భం ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఫైనల్ సందర్భంగా కౌశల్‌ను విజేతగా ప్రకటించకపోతే ఏకంగా ధర్నాలు, దాడులు, ఆత్మహత్యల బెదిరింపుల వరకు వెళ్లింది. అయితే, చివరకు కౌశల్ విజేతగా నిలిచాడు. అప్పటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో బిగ్ బాస్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేస్తున్నారే కానీ, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం మాత్రం దక్కడం లేదు. బిగ్ బాస్ సీజన్ 3లో ఫలానా వారు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగాలంటే ఫలానా నెంబర్‌కు ఫోన్ చేయండని యాడ్స్ వస్తున్నాయి. అయితే, ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని ఉంచి, తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం లేదు.

ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్‌లో ఓట్లు రానందుకు మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపేస్తున్నాం అని ఎక్కడా ప్రకటించలేదు. ప్రతి వారం చీటీల ద్వారానో, మరో రకంగానో కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నారు. ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారికి అసలు ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం అటు కంటెస్టెంట్లకు గానీ, ఇటు ప్రేక్షకులకు గానీ తెలియడం లేదు. కౌశల్ ఆర్మీ తరహాలో మరోసారి ఒత్తిడికి గురి కావొద్దనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారా? అనే సందేహం తలెత్తుతోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 గత సంవత్సరం జూన్ 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగింది. 112 రోజు ఎపిసోడ్స్‌లో 18 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో కౌశల్ విన్నర్‌గా నిలిచాడు. గీతా మాధురి రన్నరప్‌గా నిలిచింది. తనీష్, దీప్తి, సామ్రాట్ మూడు, నాలుగు, ఐదో స్థానాలు దక్కించుకున్నారు.
First published: September 14, 2019, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading