BiggBoss Telugu 3: వరుణ్ చూస్తుండగానే...వితికను బెడ్రూంలోకి ఎత్తుకొని తీసుకెళ్లిన రాహుల్ ?

వరుణ్ చూస్తుండగానే తడిగా ఉన్న ఫ్లోర్ పై ఢమాలని జారిపడింది వితిక. ఆమె పడగానే వరుణ్ గుండె కళుక్కుమంది. వితికను అక్కడే ఉన్న బాబా భాస్కర్ మాస్టర్ లేవదీయగా, రాహుల్ వెంటనే వితికను చేతులతో ఎత్తుకొని బెడ్రూంలో పడుకోబెట్టాడు.

news18-telugu
Updated: September 17, 2019, 11:22 AM IST
BiggBoss Telugu 3: వరుణ్ చూస్తుండగానే...వితికను బెడ్రూంలోకి ఎత్తుకొని తీసుకెళ్లిన రాహుల్ ?
(Image: star maa)
  • Share this:
బిగ్‌బాస్ లో త్యాగాల టాస్క్ పరాకాష్టకు చేరింది. సోమవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఫోన్ చేసి నేరుగా నామినేట్ చేయడం. నామినేషన్ నుంచి బయటపడాలంటే ఎవరైనా తాను సూచించిన టాస్క్ లు చేసి త్యాగం చేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో అసలు ఆట మొదలైంది. మొదట ఫోన్ లేపిన శ్రీముఖి నేరుగా నామినేట్ కాగా, శ్రీముఖి కోసం బాబా భాస్కర్ క్లీన్ షేవ్ చేసుకుంటే సేవ్ అవ్వచ్చని బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చాడు. కాగా భాస్కర్ గడ్డం గీయించుకొని త్యాగం చేసి శ్రీముఖిని కాపాడాడు. ఇక పునర్నవి కోసం రాహుల్ అయితే ఏకంగా 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగి, పున్నును కాపాడుకోవడమే కాదు, రిటర్న్ గిఫ్ట్ గా పున్ను ముద్దులను కూడా పొందాడు. ఇక మహేష్ కోసం హిమజ వేసుకునే బట్టలు, కాస్మోటిక్స్ అన్నీ స్టోర్ రూమ్ లో పెట్టాల్సి ఉండగా, ఈ టాస్క్ లో హిమజ కొన్ని కాస్మోటిక్స్ తన వద్దే ఉంచుకుంది. దీంతో మహేష్ నామినేట్ అయ్యాడు.

ఇక అన్నింటి కన్నా హైలైట్ త్యాగం హిమజ కోసం వరుణ్ పేడ తొట్టిలోకి దిగడం, ఎపిసోడ్ కే హైలైట్ గా నిలిచింది. ఈ టాస్క్ లో హిమజ నామినేషన్ నుంచి బయటపడేందుకు వరుణ్ పేడతొట్టిలో పడుకోవాల్సి ఉంది. అయితే కంపు కొట్టే పేడ తొట్టిలో వరుణ్ నిక్కర్ వేసుకొని పడుకున్నాడు. పేడ కంపుకు వరుణ్ వాంతులు చేసుకోవాల్సి వచ్చింది. అయితే వామిటింగ్ చేసుకునే టైమ్ లో కవర్ కోసం వితిక హాడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అంతే వరుణ్ చూస్తుండగానే తడిగా ఉన్న ఫ్లోర్ పై ఢమాలని జారిపడింది వితిక. ఆమె పడగానే వరుణ్ గుండె కళుక్కుమంది.

వితికను అక్కడే ఉన్న బాబా భాస్కర్ మాస్టర్ లేవదీయగా, రాహుల్ వెంటనే వితికను చేతులతో ఎత్తుకొని బెడ్రూంలో పడుకోబెట్టాడు. పునర్నవి, శివజ్యోతి వితికకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. పేడ తొట్టిలో ఉన్నప్పటికీ వరుణ్ మనస్సు మొత్తం వితికకు తగిలిన దెబ్బమీదనే ఉంది. హిమజ వరుణ్ కష్టాన్ని చూడలేకపోయింది. తాను నామినేట్ అయినా పర్లేదని, వరుణ్ పేటతొట్టి లోనుంచి బయటకు రమ్మని ప్రాధేయపడింది. అయినా వరుణ్ త్యాగం వృధా పోలేదు. హిమజ సేఫ్ అయ్యింది.
First published: September 17, 2019, 11:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading