Bigg Boss 3 | వితిక ఎలిమినేషన్ ముందే ఊహించింది.. ఇదిగో సాక్ష్యం...

Bigg Boss 3 | టాప్ 5 కంటెస్టెంట్ అవుతుందనుకున్న వితిక చివరకు భర్తను వదిలి బ్యాగ్ సర్దుకోవాల్సి వచ్చింది.

news18-telugu
Updated: October 20, 2019, 10:11 PM IST
Bigg Boss 3 | వితిక ఎలిమినేషన్ ముందే ఊహించింది.. ఇదిగో సాక్ష్యం...
వరుణ్ సందేశ్ వితికా షెరూ ఫైల్ ఫోటో
  • Share this:
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వితిక షేరు ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్‌లో తొలిరోజు అడుగుపెట్టిన వితిక.. 91 రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్ ఫైనల్స్ ఉండగా, టాప్ 5 కంటెస్టెంట్ అవుతుందనుకున్న వితిక చివరకు భర్తను వదిలి బ్యాగ్ సర్దుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ వారం తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతానని వితిక ముందే ఊహించింది. అది ఎలాగంటారా? బిగ్ బాస్‌లో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ వచ్చారు. ఈ సందర్భంగా వితిక తల్లి కూడా వచ్చారు. ఆ సమయంలో తన తల్లితో మాట్లాడిన వితిక.. ఓ విధమైన భావోద్వేగానికి గురైంది. ఆ సందర్భంగా తన తల్లిని ఏడవొద్దని చెబుతూ.. ‘ఏడవొద్దు. నేను రెండు వారాల్లో వచ్చేస్తా కదా. రేపు కూడా వచ్చేయొచ్చు.’ అని చెప్పింది. అంటే, ఎలిమినేషన్‌లో ఉన్న తాను బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చని ముందే ఊహించింది. దీంతో మానసికంగా సిద్ధమైనట్టు కనిపిస్తోంది.

మా చెల్లిమీద చెయ్యేస్తావా..? యువకుడిని రఫ్ఫాడించిన యువతి

First published: October 20, 2019, 10:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading