Bigg Boss 3 | వరుణ్ సందేశ్ గురించి ఓ సీక్రెట్ చెప్పేసిన వితిక తల్లి

Varun Vithika | వరుణ్ సందేశ్, వితిక గురించి నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు వితిక తల్లి సరదాగా బదులిచ్చారు.

news18-telugu
Updated: October 20, 2019, 10:58 PM IST
Bigg Boss 3 | వరుణ్ సందేశ్ గురించి ఓ సీక్రెట్ చెప్పేసిన వితిక తల్లి
వరుణ్ సందేశ్, వితక
  • Share this:
బిగ్ బాస్ కంటెస్టెంట్ వరుణ్ సందేశ్ గురించి అతడి భార్య వితిక తల్లి ఓ సీక్రెట్‌ను బయటపెట్టారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చివరి దశకు రావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఈ మధ్య కాలంలో వెరైటీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. చాలా రోజుల నుంచి కుటుంబసభ్యులకు దూరంగా ఉన్న కంటెస్టెంట్లకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి సర్ ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఈక్రమంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఒక్కో కంటెస్టెంట్ తరఫున ఒక బంధువు బిగ్ బాస్ షోలో నాగార్జునతో కలసి పాల్గొన్నారు. అయితే, వారికి కూడా బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఫైనల్స్‌కు చేరే ఐదుగురి ఎవరై ఉండొచ్చని అంచనా వేయడంతో పాటు.. ఎవరు రాకపోవచ్చనే అంచనా వేయాలని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్ తరఫున వచ్చిన అమ్మ, నాన్న, అక్క, ఫ్రెండ్స్ లాంటి వాళ్లు కూడా షాక్‌కి గురయ్యారు.

ఈ శనివారం జరిగిన ఎపిసోడ్‌లో వితిక తల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్, వితిక గురించి నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సరదాగా బదులిచ్చారు. వితిక, వరుణ్ సందేశ్‌లో ఎవరు మంచివాళ్లని నాగార్జున అడగ్గానే.. వితిక తల్లి ఎలాంటి సంకోచం లేకుండా మా అల్లుడు వెరీగుడ్ అని చెప్పింది. దీంతో వితిక షాక్‌కి గురైంది. ‘మా అమ్మ, భర్త ఇద్దరూ ఒక పార్టీనే. ఇద్దరూ కలసి నన్ను ఏడిపిస్తుంటారు.’ అని వితిక కూడా దెప్పింది.

బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ
Published by: Ashok Kumar Bonepalli
First published: October 20, 2019, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading