Bigg Boss Telugu 3: వరుణ్‌‌ను పక్కన పడుకోనివ్వను అంటున్న వితిక...ఎందుకో తెలుసా...?

భార్య కోసం వరుణ్ పేడ తొట్టిలో విపరీతమైన కంపు సైతం భరిస్తూ వితికకు ఎలా ఉంది అని అడిగాడు. దీంతో వరుణ్ తన భార్య వితికపై చూపించిన ప్రేమను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

news18-telugu
Updated: September 17, 2019, 12:24 PM IST
Bigg Boss Telugu 3: వరుణ్‌‌ను పక్కన పడుకోనివ్వను అంటున్న వితిక...ఎందుకో తెలుసా...?
వరుణ్, వితిక (Image: StarMaa)
  • Share this:
హిమజ కోసం పేడ టాస్క్ ఒప్పుకున్న వరుణ్ సందేశ్‌కు వితిక అనుకోని పనిష్ మెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ త్యాగాల టాస్క్ లో భాగంగా హిమజ కోసం వరుణ్ పేడ తొట్టిలో పడుకోవాల్సి వచ్చింది. టాస్క్ గురించి సభ్యులకు వరుణ్ చెప్పగానే వితిక షాక్‌కు గురైంది. అంతేకాదు...వరున్ పెండ కంపుతో తన పక్కన వస్తే వాంతులు రావడం ఖాయమని, అందుకే రెండు రోజుల పాటు బెడ్ మీదకు రానివ్వనని వితిక తేల్చిచెప్పింది. దీంతో వరు‌ణ్‌కు వితిక పక్కన సుఖంగా రెండు రోజుల పాటు నిద్రించే యోగం మిస్ అయ్యింది. మరోవైపు వరుణ్ సందేశ్ పేడ తొట్టిలో ఉన్నప్పుడు వాంతులు చేసుకుంటుండగా, వితిక డస్ట్ బిన్ తెచ్చే క్రమంలో జారిపడటం, వరుణ్ ఆ సీన్ చూసి కాస్త ఎమోషనల్ అవడం, సోషల్ మీడియాలో వరుణ్ ఫాలోయర్లకు కన్నీళ్లు తెప్పించింది.

భార్య కోసం వరుణ్ పేడ తొట్టిలో విపరీతమైన కంపు సైతం భరిస్తూ వితికకు ఎలా ఉంది అని అడిగాడు. దీంతో వరుణ్ తన భార్య వితికపై చూపించిన ప్రేమను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 
First published: September 17, 2019, 12:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading