Bigg Boss Telugu 3: బిగ్ బాస్ నుంచి అలీరెజా ఎలిమినేషన్‌కు విజయ్ దేవరకొండ కారణమా...?

అలీరెజా ఎలిమినేషన్ అయ్యేందుకు అతడి కోపమే శత్రువని, సోషల్ మీడియాలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సిినిమా విజయవంతం అయిన తర్వాత యూత్ లో చాలా వరకూ యాంగ్రీ యంగ్ మేన్ యాటిట్యూడ్‌పై ఒక మోజు మొదలైంది. కానీ నిజజీవితంలో అలా కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఉండటం జనాలకు అంతలా నచ్చదని అలీరెజా విషయంలో ప్రూవ్ అయ్యిందని థియరీలు కూడా వినివిస్తున్నాయి.

news18-telugu
Updated: September 10, 2019, 8:47 PM IST
Bigg Boss Telugu 3: బిగ్ బాస్ నుంచి అలీరెజా ఎలిమినేషన్‌కు విజయ్ దేవరకొండ కారణమా...?
అలీరెజా, విజయ్ దేవరకొండ
  • Share this:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో యాంగ్రీ యంగ్ మెన్ అనే టైటిల్ ఇవ్వాల్సి వస్తే దానికి అర్హుడు కేవలం అలీ రెజానే అని ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. మొత్తం 50 ఎపిసోడ్స్ లో తన యాటిట్యూడ్ ను ఏమాత్రం చేంజ్ చేసుకోలేదు. టాస్క్ ల సమయంలో ఆడ, మగ అనే తేడా లేకుండా పక్కా ప్రొఫెషనల్ గా అలీ రెచ్చిపోయాడు. అంతేకాదు హౌస్ మేట్స్ ఎవరైనా సరే తన యాంగ్రీ యాటిట్యూడ్ తో అలీరెజా చెలరేగిపోయేవాడు. సోషల్ మీడియాలో సైతం అలీరెజాను బిగ్ బాస్ అర్జున్ రెడ్డి అంటూ కామెంట్స్ వినిపించేవి. అర్జున్ రెడ్డిలాగానే అలీరెజా సైతం యాంగర్ మేనేజ్ మెంట్ లో జీరో అనే నెటిజన్లు పలు మార్లు తెలిపారు. ఎవరు ఏమి అనుకున్నా సరే అలీరెజా మాత్రం తన యాటిట్యూడ్ ఏమాత్రం చేంజ్ చేసుకోలేదు. బిగ్‌బాస్‌కు సంబంధించినంత వరకూ అతడే  టఫ్ కంటెస్టెంట్ అనే ప్రచారం జరిగింది. అయితే అందరికీ షాక్ ఇస్తూ అలీరెజా ఎలిమినేట్ అవ్వడం ఆయన అభిమానులకు మింగుడు పడని విషయమే.

ఇదిలా ఉంటే అలీరెజా ఎలిమినేషన్ అయ్యేందుకు అతడి కోపమే శత్రువని, సోషల్ మీడియాలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సిినిమా విజయవంతం అయిన తర్వాత యూత్ లో చాలా వరకూ యాంగ్రీ యంగ్ మేన్ యాటిట్యూడ్‌పై ఒక మోజు మొదలైంది. కానీ నిజజీవితంలో అలా కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఉండటం జనాలకు అంతలా నచ్చదని అలీరెజా విషయంలో ప్రూవ్ అయ్యిందని థియరీలు కూడా వినివిస్తున్నాయి.



First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>