Bigg boss telugu 3: శ్రీముఖిపై నోరుజారిన రాహుల్...రవికి రక్తస్రావం

రవికి చేతికి గాయమైంది. దాంతో హౌజ్‌లోకి డాక్టర్ వచ్చి రవికి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. శ్రీముఖి రెచ్చగొట్టడం వల్లే అతడికి గాయమైందని రాహుల్ ఆమెపై మాటల దాడి చేశాడు.

news18-telugu
Updated: August 8, 2019, 3:00 PM IST
Bigg boss telugu 3: శ్రీముఖిపై నోరుజారిన రాహుల్...రవికి రక్తస్రావం
శ్రీముఖి (Image: star maa)
  • Share this:
Bigg boss telugu 3: బిగ్‌బాస్‌లో హౌజ్‌మేట్స్ గేమ్ రసవత్తరంగా మారింది. రోజుకో వివాదంతో సభ్యులు గ్రూపులుగా చీలుతున్నారు. ఈ క్రమంలో బుధవారం హౌజ్‌లో ఆసక్తికర ఘటనలు జరిగాయి. టాస్క్‌లో భాగంగా నిధిని దొంగిలించేందుకు శ్రీముఖి ప్రయత్నించింది. అనంతరం రవి కూడా అలాగే ప్రయత్నించండంతో అతడి చేతికి గాయమైంది. చేతి నుంచి రక్తం కారడంతో వితిక, రాహుల్ శ్రీముఖిని టార్గెట్ చేశారు. ఆమె రెచ్చగొట్టడం వల్లే రవికి గాయమైందని విమర్శించారు. ఈ క్రమంలో శ్రీముఖిపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నోరుజారాడు. అసలేం జరిగిందంటే...

హౌజ్‌లో ప్రస్తుతం తికమకపురం గ్రామం టాస్క్ జరుగుతోంది. అందులో భాగంగా ఊరి పెద్దలుగా వరుణ్ సందేశ్, తమన్నా నటిస్తున్నారు. గ్రామంలోని జంటగా అలీ-పునర్నవి, అన్నదమ్ములుగా రాహుల్-మహేష్, అక్కాచెల్లెళ్లుగా రోహిణి-వితిక ఉన్నారు. లాయర్‌ పాత్రను హిమజ పోషించగా.. బద్దకస్తుడైన పోలీస్ ఆఫీసర్‌గా బాబా భాస్కర్, స్ట్రిక్ట్ కానిస్టేబుల్‌గా శివజ్యోతి నటిస్తున్నారు. ఇక దొంగలుగా అషూ రెడ్డి, శ్రీముఖి, రవికృష్ణ మారిపోయారు.

గ్రామంలో ఉన్న నిధిని దొంగిలించేందుకు దొంగలు ప్లాన్ చేశారు. దాన్ని ముందే పసిగట్టిన గ్రామస్తులు.. డబ్బులను గాజు బాక్స్‌లో దాచి కాపలాగా ఉన్నారు. ఐతే ఆ గాజు బాక్స్‌ను డంబెల్‌తో పగులగొట్టి చోరీ చేసేందుకు శ్రీముఖి ట్రై చేసింది. కానీ మిగతా సభ్యులు ఆమెను పక్కకు లాగేశారు. అక్కడే ఉన్న రవిని బాక్స్‌ని బ్రేక్ చేయమని చెప్పడంతో...అతడు వెనకాముందు ఆలోచించకుండా చేత్తో పగులగొట్టాడు. ఈ క్రమంలో రవికి చేతికి గాయమైంది. దాంతో హౌజ్‌లోకి డాక్టర్ వచ్చి రవికి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. శ్రీముఖి రెచ్చగొట్టడం వల్లే అతడికి గాయమైందని రాహుల్ ఆమెపై మాటల దాడి చేశాడు.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అందులో శ్రీముఖి తప్పేం లేదని...దెబ్బ తగులుతుందని రవికి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా..? అని శ్రీముఖి అండగా నిలుస్తున్నారు. సిచుయేషన్‌ను వాడుకొని వితిక-వరుణ్-పునర్నవి-రాహుల్ గ్యాంగ్ శ్రీముఖిపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె అభిమానులు మండిపడుతున్నారు.First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>