Bigg Boss Telugu 3 : ఈరోజు డబుల్ ఎలిమినేషల్.. ఇంటి నుండి వెళ్లేది ఆ ఇద్దరే..

Bigg Boss Telugu 3 : కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. 

news18-telugu
Updated: October 20, 2019, 12:52 PM IST
Bigg Boss Telugu 3 : ఈరోజు డబుల్ ఎలిమినేషల్.. ఇంటి నుండి వెళ్లేది ఆ ఇద్దరే..
నాగార్జున (Star Maa/Photo)
  • Share this:
Bigg Boss Telugu 3 : కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ఈ రోజుతో బిగ్ బాస్ షోలో 12 వ వారం ముగుస్తుంది. కాగా ఈ షో ముగియాడానికి ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. చివరి వారంలో హౌజ్‌లో ఐదుగురు మాత్రమే ఫైనల్‌కు చేరుకుంటారు. ప్రస్తుతం హౌస్‌లో వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్, అలీ రెజా, వితిక, శ్రీముఖి, శివజ్యోతిలతో కలిపి మొత్తం 7 గురు మాత్రమే  మిగిలారు. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులతో బిగ్ బాస్  ఆడించిన ఈ ఆటలో ఏడుగురి కంటెస్టెంట్స్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్‌లు సేఫ్ అయ్యారు. ఇక మిగిలిన నలుగురు వరుణ్, వితికా, శివజ్యోతి, అలీలలో ఒకరు లేదా ఇద్దరు ఈరోజు ఎపిసోడ్‌లో ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ రోజు శివజ్యోతి కానీ, వితికా షేరు కానీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మధ్య తన ప్రవర్తన కారణంగా వితికా కొంచెం నెగిటివిటీ మూట గట్టుకుంది. దీంతో ఈ రోజు వితికా షేరు, శివజ్యోతి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.




 



View this post on Instagram




 

Sunday ochesindi so its Funday time!!! kani last lo twist emana untunda ?? #BiggBossTelugu3 Today at 9 PM on @StarMaa


A post shared by STAR MAA (@starmaa) on





అయితే ఒక ఎలిమినేషన్ ఉంటే మాత్రం.. దాదాపు వితికనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి వారం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈ వారం వితిక షేరు  హౌస్ నుండి ఎలిమినేట్ కావడం పక్కా అని చెబుతున్నారు. మొత్తానికి 12వ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి వితికా షేరు బయటకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందనే టాక్ వినబడుతోంది. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఈరోజు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండోచ్చని తెలుస్తోంది. ఈ డబుల్ ఎలిమినేషన్‌లో వితికా, శివజ్యోతిలు ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.



 




View this post on Instagram




 

Special guests eeroju chala special valu ocharu #BiggBossTelugu3 Today at 9 PM on @StarMaa


A post shared by STAR MAA (@starmaa) on




First published: October 20, 2019, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading