Bigg Boss Telugu 3 : టైటిల్ విన్నర్‌గా రాహుల్‌.. ఇవిగో సాక్ష్యాలు..

Bigg Boss Telugu 3 : పదకొండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగులో ప్రస్తుతం 12వ వారం నడుస్తోంది. ఇంకా కొద్ది రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలుస్తోంది. అయితే వస్తున్న సమాచారం మేరకు రాహుల్‌కే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని తెలుస్తోంది.

news18-telugu
Updated: October 18, 2019, 1:00 PM IST
Bigg Boss Telugu 3 : టైటిల్ విన్నర్‌గా రాహుల్‌.. ఇవిగో సాక్ష్యాలు..
Instagram/sipligunjrahul
news18-telugu
Updated: October 18, 2019, 1:00 PM IST
Bigg Boss Telugu 3 :  పదకొండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగులో ప్రస్తుతం 12వ వారం నడుస్తోంది. ఈ షో ముగియాడానికి ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. కాగా చివరి వారంలో హౌజ్‌లో ఐదుగురు మాత్రమే ఫైనల్‌కు చేరుకుంటారు. దీంతో ఈ  వారం వితికా షేరు, శివజ్యోతి లేదా బాబా భాస్కర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిలో ఎలిమినేట్ అయ్యేది మాత్రం వితికా షేరే అంటున్నారు నెటిజన్స్. అది అలా ఉంటే టైటిల్ ఫేవరేట్‌గా ముందు వరుసలో  రాహుల్, అలీ రెజా, బాబా బాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్‌లు ఉన్నారు. కాగా మొదటి నుంచి శ్రీముఖి రాహుల్‌ను టార్గెట్ చేస్తూ.. కావాలని రాహుల్‌ను రెచ్చగొడుతోంది. దాంతో శ్రీముఖి పై ఆడియన్స్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ మొదలైంది. మరో వైపు వరుణ్ హౌజ్‌లో అందరితో శాంతంగా ఉంటూ.. పెద్ద మనిషి తరహాలో ప్రవర్తిస్తూ.. ఇంట్లో జరిగే గొడవలను సద్దుమణిగేలా చేస్తున్నాడు.  అయితే అది బాగానే.. మొదట వితికాను తోటి కంటెస్టెంట్‌గా చూసిన వరుణ్.. ఈ మధ్య తన భార్య వైపు కొంత పక్షపాతం చూపెడుతుండటంతో అతనిపై ఆడియన్స్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది.


మరోవైపు రాహుల్ .. శ్రీముఖి చేసే టార్గెట్‌ని అడ్డుకుంటూ స్ట్రాంగ్‌గా నిలబడుతూ.. ఇక్కడి దాకా వచ్చాడు. అంతేకాకుండా రాహుల్ ప్రవర్తన, ప్రాంక్ నెస్, ఆటీట్యూడ్ కూడా రాహుల్‌కు కలిసోస్తుందని తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులు ఆయన అండగా ఉంటున్నారు. దీనిలో భాగంగానే రాహుల్‌కు రోజు రోజుకు ఓట్ షేరింగ్ పెరుగుతూ  వస్తోంది. దీంతో బిగ్‌బాస్  తెలుగు మూడవ సీజన్ విజేత రాహుల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.







 




View this post on Instagram




 

Subscription recharge avtadha? 😂😂 #RahulSipligunj #BiggBoss #BiggBossTelugu3 #BB3 #Punarnavi #Recharge #Entertainment #StarMaa


A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on




First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...