Bigg Boss Telugu 3: రెచ్చిపోయిన రాహుల్, వరుణ్... హింసాత్మకంగా మారిన టాస్క్..

ఈరోజు ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ ప్రోమోలో వరుణ్, రాహుల్.. 'టిక్కెట్ టు ఫినాలే' అనే టాస్క్‌లో ఒకరు మీద ఒకరు పడుతూ.. బొర్లుకుంటూ కిందపడి కొట్టుకుంటున్నారు.

news18-telugu
Updated: October 21, 2019, 1:05 PM IST
Bigg Boss Telugu 3: రెచ్చిపోయిన రాహుల్, వరుణ్... హింసాత్మకంగా మారిన టాస్క్..
Instagram/starmaa
news18-telugu
Updated: October 21, 2019, 1:05 PM IST
Bigg Boss Telugu 3:  కింగ్ నాగార్జున హోస్ట్‌గా అదరగొడుతూ.. విజయవంతంగా సాగుతున్న బిగ్ బాస్ సీసన్ 3 నిన్నటితో 92 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్‌‌లో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యులు నామినేట్ అవ్వడంతో  ప్రేక్షకులతో పాటు, ఇటు ఇంటి సభ్యులలో ఉత్కంఠ  ఎక్కువైంది. ఇంకొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ తెలుగు 3 టైటిల్ విన్నర్ తేలనున్న తరుణంలో ఇప్పుడు ఎవరు ఇంటి నుండి వెళ్లిపోనున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.



 




Loading...

View this post on Instagram




 

"Ticket To Finale" evaru geluchukuntaru?? #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa


A post shared by STAR MAA (@starmaa) on





అది అలా ఉంటే.. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగానే.. నిన్నటి ఎపిసోడ్‌లో వితిక షేరు ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ ఘటనతో షాక్ తిన్న వరుణ్ కొంత ఎమోషనల్ అవ్వగా.. వితిక బాగానే మేనేజ్ చేస్తూ.. తమ ఎమోషన్ కంట్రోల్ చేసుకుంది. కాగా ఈరోజు ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ ప్రోమోలో వరుణ్, రాహుల్.. టిక్కెట్ టు ఫినాలే అనే టాస్క్‌లో ఒకరు మీద ఒకరు పడుతూ.. బొర్లుకుంటూ కిందపడి కొట్టుకుంటున్నారు. ఈ ప్రోమోను చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ కొంత వయోలెన్స్‌తో కూడిందిగా తెలుస్తోంది. ఇద్దరూ తమ బలాలను చూపిస్తూ..రెచ్చిపోయారు. మరీ ఈ టాస్క్‌లో గెలిచిందేవరో తెలియాలంటే మాత్రం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకూ వేయిట్ చేయాల్సిందే..
సముద్రపు ఒడ్డున పునర్నవి.. పరవశంలో బిగ్ బాస్ బ్యూటీ..
First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...