Bigg Boss 3 | రాహుల్‌ కాదు... రియల్ విన్నర్ ఎవరో చెప్పిన శ్రీముఖి

టాప్ 4 ప్లేస్‌లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా మాస్టర్ నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ కాగా, శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది.

news18-telugu
Updated: November 10, 2019, 7:04 PM IST
Bigg Boss 3 | రాహుల్‌ కాదు... రియల్ విన్నర్ ఎవరో చెప్పిన శ్రీముఖి
శ్రీముఖి, బాబా భాస్కర్ (star maa/Photos)
  • Share this:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 105 రోజుల పాటు జరిగిన ఈ రియాలిటీ షోలో బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు విజేతగా రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రకటించారు. అయితే, మొదటి నుంచి విన్నర్ తానేననే భావనలో ఉన్న శ్రీముఖికి ఇది ఊహించని షాక్ తగిలింది. అయితే, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వకుండా మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లింది. అక్కడి నుంచి తన ఇన్‌స్టాలో ప్రత్యేకంగా తన అభిమానుల కోసం లైవ్ లో మాట్లాడింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ విన్నర్ అనే అంశంపై తన అభిప్రాయాన్ని చెప్పింది. ‘మీ దృష్టిలో నేనే విన్నర్. నా ఉద్దేశం ప్రకారం నా కన్నా ముందు విన్నర్ ఎవరంటే బాబా భాస్కరే. బాబా మాస్టర్ రియల్ విన్నర్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు టాస్క్ విషయంలో కానీ, ఇంట్లో మెలిగిన విధానంలో కానీ ఆయన చాలా బాగా వ్యవహరించారు.’ అని శ్రీముఖి అభిప్రాయపడింది. ‘బాబా మాస్టర్ ట్రూ విన్నర్’ అని తేల్చేసింది. బిగ్ బాస్ హౌస్ సీజన్ 3లో చివరి వరకు ఐదుగురు నిలిచారు. అందులో టాప్ 4 ప్లేస్‌లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా మాస్టర్ నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ కాగా, శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది.
First published: November 10, 2019, 7:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading