ఎన్ని కెమెరాలు ఉన్నా.. శ్రీముఖి సీక్రెట్‌ కనిపెట్టలేకపోయిన బిగ్ బాస్..

Srimukhi | బిగ్ బాస్‌కు తెలియకుండా పగటి సమయంలో నిద్రపోయేవారట. అన్ని కెమెరాలు ఉన్నా కూడా బిగ్ బాస్ ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయాడు.

news18-telugu
Updated: November 11, 2019, 7:08 PM IST
ఎన్ని కెమెరాలు ఉన్నా.. శ్రీముఖి సీక్రెట్‌ కనిపెట్టలేకపోయిన బిగ్ బాస్..
శ్రీముఖి (Image : star maa)
  • Share this:
బిగ్ బాస్... ‘మిమ్మల్ని చూస్తున్నాడు.’ అనేది ఓ రకంగా ట్యాగ్ లైన్. బిగ్ బాస్ హౌస్‌లో అణువణువును కవర్ చేసేలా కెమెరాలు ఉంటాయి. ఒక్క బాత్రూమ్ మినహా మిగిలిన అన్ని చోట్లా కెమెరా కళ్లు చూస్తూనే ఉంటాయి. బిగ్ బాస్ హౌస్‌లో ఓ కండిషన్ ఉంది. ఉదయం లైట్లు వెలిగిన దగ్గరి నుంచి మళ్లీ బిగ్ బాస్ లైట్లు ఆర్పే వరకు ఎవరూ నిద్రపోవడానికి వీల్లేదు. పగలు ఎవరైనా నిద్రపోతే.. కెమెరా కళ్లు పసిగట్టేస్తాయి. అప్పుడు కుక్క అరుస్తుంది. వారిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. అయితే, బిగ్ బాస్‌కు తెలియకుండా, కెమెరా కళ్లుగప్పి హౌస్‌మేట్స్ నిద్రపోయేవారట.

అది ఎలా అంటే.. అమ్మాయిలు ఫ్లక్కర్ అనే వస్తువుతో ఐబ్రోస్‌ను కట్ చేసుకుంటారు. అలా లాగిప్పుడు బాగా నొప్పి పుడుతుంది. కాబట్టి ఆ బాధను తట్టుకోవడానికి కళ్లుమూసుకుంటారు. ఈ లాజిక్‌ను శ్రీముఖి అండ్ టీమ్ బాగా వాడుకుంది. అమ్మాయిలు ఐబ్రోస్ కట్ చేసుకున్నట్టుగా నటిస్తూ.. కళ్లుమూసుకుని కాసేపు నిద్రపోయేవారు. అలా ఒకరికొకరు 15 నిమిషాలు ఐబ్రోస్ కట్ చేస్తున్నట్టు నటిస్తూ నిద్రపోయేవారు. ఇది అమ్మాయిలే కాదు. అబ్బాయిలు కూడా ఫాలో అయ్యారు. రవికృష్ణ వరుణ్‌కి, వరుణ్ సందేశ్.. బాబా మాస్టర్‌కి, బాబా మాస్టర్ వరుణ్ తేజ్‌కి.. ఐబ్రోస్ పీకుతున్నట్టుగా నటిస్తూ నిద్రపోయేవారు. ఇలా ఒకసారి, రెండు సార్లు కాదు. చాలాసార్లు చేశారు. కానీ, ఆ టెక్నిక్‌ను బిగ్ బాస్ కెమెరాలు కనిపెట్టలేకపోయాయి. అది తెలుసుకునేలోపే మూడో సీజన్ కూడా ముగిసిపోయింది.

First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...