మాల్దీవ్స్ బీచుల్లో దుమ్ము లేపుతున్న శ్రీముఖి..

శ్రీముఖి.. ఈటీవీలో ప్రసారం అయ్యే 'పటాస్' షో ద్వారా రోజూ టీవీల్లో కనిపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యింది.

news18-telugu
Updated: November 9, 2019, 12:15 PM IST
మాల్దీవ్స్ బీచుల్లో దుమ్ము లేపుతున్న శ్రీముఖి..
Instagram/sreemukhi
news18-telugu
Updated: November 9, 2019, 12:15 PM IST
శ్రీముఖి.. ఈటీవీలో ప్రసారం అయ్యే 'పటాస్' షో ద్వారా రోజూ టీవీల్లో కనిపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యింది. ఆ షోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలుస్తూ వచ్చాయి. అయితే కేరిర్ ఆరంభంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌తో యాంక‌ర్‌గా మొద‌లుపెట్టిన శ్రీముఖి.. ఆ త‌ర్వాత యాక్టర్‌గా మారి కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అవకాశం ఉన్నప్పుడల్లా.. సినిమాలు చేస్తూనే ఇటూ యాంకరింగ్ చేస్తూ అదరగొడుతోంది. ఆ షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకున్న శ్రీముఖి తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' సీజన్‌లో పాల్గొంది. షోలో పాల్గొనడమే కాదు మూడవ సీజన్ రన్నరప్‌గా నిలిచింది. దాదాపు మూడు నెలలకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో తన అల్లరితో, టాస్క్‌లతో అదరగొట్టిన శ్రీముఖి రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్లింది. ప్రస్తుతం శ్రీముఖి మాల్ధీవ్స్ బీచుల్లో సందడి చేస్తోంది. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్లిన ఈ అందాల యాంకర్ కమ్ యాక్టర్ దానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను, ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
Loading...

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi) on

మాల్దీవ్స్ బీచుల్లో అందాల శ్రీముఖి..
First published: November 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...