శ్రీముఖి సింగల్ డైలాగ్.. ట్రోల్స్ వేసిన వారందరికీ...

Srimukhi | ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న శ్రీముఖి త్వరలో హైదరాబాద్ రాబోతోంది. వచ్చాక వీలైనంత మందిని కలుస్తానని చెప్పింది. ఓ ఫ్యాన్ మీట్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పింది శ్రీముఖి.

news18-telugu
Updated: November 10, 2019, 8:48 PM IST
శ్రీముఖి సింగల్ డైలాగ్.. ట్రోల్స్ వేసిన వారందరికీ...
శ్రీముఖి (Instagram/sreemukhi)
  • Share this:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నరప్ శ్రీముఖి స్టైలే వేరు. బిగ్ బాస్ షో జరుగుతున్న సమయంలో శ్రీముఖి మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. హౌస్‌లో ఆమె వ్యవహారశైలి మీద కావొచ్చు. అంతకు ముందు ఆమె హోస్ట్ చేసిన టీవీ షోల మీద కావొచ్చు.. భయంకరంగా ట్రోల్స్, మీమ్స్ వేశారు. అయితే, బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 105 రోజులు వాటి గురించి తెలుసుకోవడానికి ఆమెకు అవకాశం లభించలేదు. అయితే, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాటన్నిటి గురించి శ్రీముఖి ఫుల్ డిటెయిల్స్ తెలుసుకుంది. తన మీద జోక్స్ వేసిన వారి గురించి, తన మీద వేసిన మీమ్స్, ట్రోల్స్ గురించి కూడా తెలుసుకుంది. అయితే, వారికి ఒకే ఒక్క డైలాగ్‌తో సమాధానం చెప్పింది.

‘మీమ్స్ వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. ఓహో ప్రపంచంలో ఇవన్నీ జరుగుతున్నాయా అని కూడా తెలుస్తుంది. సమాజానికి ఎన్నో విషయాలు తెలియజేస్తూ మీరు చాలా బాధ్యతాయుతమైన పొజిషన్‌లో ఉన్నారు. నన్ను చాలా మంది సపోర్ట్ చేశారు. నా మీద కొందరు నిందలు కూడా వేశారు. అయినా నేను వాళ్ల జోలికి వెళ్లను. అయితే, ట్రోల్స్, మీమ్స్ చేసిన వారందరికీ ఒక్కటే చెబుతున్నా. గుడ్‌లక్’ అని శ్రీముఖి చెప్పింది.

తాను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న శ్రీముఖి త్వరలో హైదరాబాద్ రాబోతోంది. వచ్చాక వీలైనంత మందిని కలుస్తానని చెప్పింది. ఓ ఫ్యాన్ మీట్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పింది శ్రీముఖి.
First published: November 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading