Bigg Boss 3: బిగ్ బాస్ ఫినాలేకి టికెట్ గెలిచిన రాహుల్

Bigg boss 3: ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యలకు టికెట్ టూ ఫినాలే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో రాహుల్ సిప్లిగంజ్ విజయం సాధించడంతో అతడు నేరుగా ఫినాలేకు చేరుకున్నాడని బిగ్ బాస్ ప్రకటించాడు.

news18-telugu
Updated: October 22, 2019, 10:49 PM IST
Bigg Boss 3: బిగ్ బాస్ ఫినాలేకి టికెట్ గెలిచిన రాహుల్
రాహుల్ సిప్లిగంజ్ (Source: Star Maa twitter)
news18-telugu
Updated: October 22, 2019, 10:49 PM IST
బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరుకుంది. 13 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌ బాస్ హౌస్‌లో టాస్క్‌లు, సభ్యుల ఆటలు రసవత్తరంగా మారాయి. ఇక మరో రెండు వారాల్లో ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో టికెట్ టూ ఫినాలే గెలిచేందుకు ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యులకు.. బ్యాటరీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజయం సాధించడంతో అతడు నేరుగా ఫినాలేకు చేరుకున్నాడు. రాహుల్‌ని అభినందించిన బిగ్‌ బాస్ ఫైనల్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక మిగిలిన సభ్యులు వరుణ్ సందేశ్, అలీ రెజా, బాబా భాస్కర్, శ్రీముఖి, శివజ్యోతి ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఈ వారాంతంలో ఇద్దరు సభ్యులు ఎలిమినేట్ అవుతారని.. మిగిలిన నలుగురు సభ్యులు ఫైనల్‌కు వెళ్తారని ప్రచారం జరుగుతోంది.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...