Bigg Boss Telugu 3 | రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ కాలేదు.. బిగ్ బాస్ ఏం చేశారంటే...

Bigg Boss Elimination | మొదట రాహుల్ సిప్లిగంజ్‌ను ఎలిమినేట్ చేశారు. అయితే, అది ఫేక్ ఎలిమినేషన్ అని నాగార్జున ప్రకటించాడు.

news18-telugu
Updated: September 21, 2019, 10:54 PM IST
Bigg Boss Telugu 3 | రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ కాలేదు.. బిగ్ బాస్ ఏం చేశారంటే...
రాహుల్ సిప్లిగంజ్ (Source: Star Maa twitter)
news18-telugu
Updated: September 21, 2019, 10:54 PM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రేక్షకులు ఈ వారం బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం రెండు ఎలిమినేషన్లు ఉంటాయని ప్రకటించిన బిగ్ బాస్.. అందులో ఈ రోజు రాహుల్ సిప్లిగంజ్‌ను ఎలిమినేట్ చేశాడు. అతడిని బయటకు పంపాడు. అయితే, చివరకు చావు కబురు చల్లగా చెప్పాడు హోస్ట్ నాగార్జున. రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ కాలేదని, ఇది ఫేక్ ఎలిమినేషన్ అని ప్రకటించగానే రాహుల్ షాక్‌కి గురయ్యాడు. వచ్చిన దారిలోనే లోపలికి వెళ్లాలని రాహుల్ సిప్లిగంజ్‌కు నాగార్జున సూచించాడు. అయితే, లోపలికి వెళ్లాక బిగ్ బాస్ ఏం చెబుతారో తనకు తెలియదని చెప్పాడు. దీంతో రాహుల్‌ సిప్లిగంజ్‌ను ప్రత్యేకంగా సీక్రెట్ రూమ్‌కి పంపినట్టు తెలుస్తోంది. సహజంగా ఎలిమినేషన్‌కు సంబంధించి అంతా సీక్రెట్‌గా ఉంచుతారు. ఈ రోజు స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో... రాహుల్ ఎలిమినేట్ అయిపోయినట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో రాహుల్ ఎలిమినేట్ అయిపోతాడని అంతా భావించారు. అయితే, చివర్లో రాహుల్‌ను లోపలికి పంపడం ద్వారా బిగ్ షాక్ ఇచ్చాడు.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...