Bigg Boss 3 | ఆ విషయం రాహుల్‌కి చెప్పాలని ఉందంటున్న పునర్నవి..

Rahul Sipligunj Punarnavi | ఓసారి ఫేక్ ఎలిమినేట్ అయి మళ్లీ లోపలికి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. ఈసారి కూడా ఎలిమినేట్ అవుతాడా? లేదా? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

news18-telugu
Updated: October 12, 2019, 9:03 PM IST
Bigg Boss 3 | ఆ విషయం రాహుల్‌కి చెప్పాలని ఉందంటున్న పునర్నవి..
పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్
news18-telugu
Updated: October 12, 2019, 9:03 PM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి ఎలిమినేట్ అయిన పునర్నవి ఎట్టకేలకు రాహుల్ సిప్లిగంజ్ గురించి తన మనసులో మాట బయటపెట్టింది. గత వారం పునర్నవి ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత పలు టీవీ ఛానళ్లకు, యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా వారందరి నుంచి ప్రధానంగా బిగ్ బాస్ గురించిన ప్రశ్నలతో పాటు రాహుల్ సిప్లిగంజ్‌తో ఉన్న అనుబంధం గురించినవే వస్తున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గురించి పునర్నవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాహుల్ సిప్లిగంజ్‌కు బయట ఉన్న క్రేజ్ గురించి తెలిసి తాను షాక్‌కి గురయ్యానని తెలిపింది. ఇంత క్రేజ్ ఉన్న విషయం రాహుల్‌కు తెలియదని చెప్పింది. ఈ విషయం రాహుల్‌కి తెలిస్తే.. అతడు బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ మరింత బాగా ఆడతాడని ఆకాంక్షించింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చివరి దశకు వచ్చేస్తోంది. ఈ క్రమంలో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని కార్యక్రమం హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. అయితే, ఓసారి ఫేక్ ఎలిమినేట్ అయి మళ్లీ లోపలికి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. ఈసారి కూడా ఎలిమినేట్ అవుతాడా? లేదా? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్‌ను పైనలిస్ట్‌ల్లో ఒకడిగా తనకు చూడాలని ఉందని పునర్నవి మనసులో మాట బయటపెట్టింది.

వీరిలో మిసెస్ అమరావతి అయ్యేదెవరు?



First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...