Bigg Bogss Telugu 3 | రాహుల్ ఫ్రెండా? లవరా?.. క్లారిటీ ఇచ్చిన పునర్నవి

పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఉన్నది ప్రేమా? స్నేహమా? అనేది బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు అందరికీ ఉన్న అనుమానం. ఈ అనుమానం బిగ్ బాస్‌కి కూడా వచ్చింది.

news18-telugu
Updated: September 19, 2019, 6:14 PM IST
Bigg Bogss Telugu 3 | రాహుల్ ఫ్రెండా? లవరా?.. క్లారిటీ ఇచ్చిన పునర్నవి
పునర్నవి, రాహుల్
  • Share this:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో హాట్ కపుల్‌గా పేరు పొందారు రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి. నిజ జీవితంలో భార్యాభర్తలు అయిన వితిక, వరుణ్ సందేశ్ కంటే రాహుల్, పునర్నవి మధ్య నడిచే ఎపిసోడ్ అత్యంత రసవత్తరంగా ఉంటుందని బిగ్ బాస్ ప్రేక్షకుల అభిప్రాయం. అయితే, వారిద్దరి మధ్య ఉన్నది ప్రేమా? స్నేహమా? అనేది బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు అందరికీ ఉన్న అనుమానం. ఈ అనుమానం బిగ్ బాస్‌కి కూడా వచ్చింది. దీంతో ఈ రోజు ఎపిసోడ్‌లో దానిపై ఓ సందర్భంలో క్లారిటీ ఇప్పించాడు. రాహుల్, పునర్నవి మధ్య ఉన్న గాసిప్స్‌కి సంబంధించి వితిక అడిగిన ప్రశ్నకు పునర్నవి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం లవర్స్ కాదని కుండబద్దలు కొట్టింది. అయితే, ఫ్రెండ్స్ కూడా కాదని చెప్పింది. ఓ కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్ అంటూ వివరణ ఇచ్చింది.

First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు