Bigg Boss: శివజ్యోతిని అంత మాటన్నాడా? వరుణ్‌పై నెటిజన్ల మండిపాటు

bigg boss telugu 3: శివజ్యోతి పట్ల వరుణ్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో వితికను 'పో' అన్నందుకే మహేష్‌ను టార్గెట్ చేసి రెచ్చిపోయాడని.. ఇప్పుడు శివజ్యోతిని అంత మాటనడం సమంజసమేనా అంటూ అంటూ విరుచుకుపడుతున్నారు.

news18-telugu
Updated: October 16, 2019, 7:08 PM IST
Bigg Boss: శివజ్యోతిని అంత మాటన్నాడా? వరుణ్‌పై నెటిజన్ల మండిపాటు
శివజ్యోతి, వరుణ్ సందేశ్
  • Share this:
బిగ్‌బాస్ తెలుగు 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరుకుంది. మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో టైటిల్ వేటలో హౌస్‌మేట్స్ గేమ్‌ మరింత రసవత్తరంగా మారింది. రీసెంట్‌గా జరిగిన నామినేషన్ టాస్కులో పెద్ద హైడ్రామే జరిగింది. ఇంటి సభ్యులు తీసిన చీటీల ఆధారంగా 7 నెంబర్లను కేటాయించారు. మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు సేఫ్ జోన్‌లో ఉంటారు. మిగిలిన సభ్యులు నామినేట్ అవుతారు. ఐతే తొలి మూడు స్థానాల్లో ఉన్న సభ్యులను మిగతా సభ్యులు కన్విన్స్ చేసి ఆ స్థానాలను చేజిక్కించుకోవచ్చు. ఈ క్రమంలో వరుణ్, శివజ్యోతి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఒకటో స్థానంలో ఉన్న బాబా, రెండో స్థానంలో ఉన్న రాహుల్.. శివజ్యోతికి తమ స్థానాలను ఇచ్చేందుకు నిరాకరించారు. ఇక మూడో స్థానంలో ఉన్న వరుణ్ దగ్గరికి వచ్చి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అతడు కూడా తన స్థానాన్ని ఇవ్వలేదు. ఐతే వితిక వచ్చి అడగ్గానే వరుణ్ తన ర్యాంకును త్యాగం చేస్తాడు. ఈ విషయం శివజ్యోతికి నచ్చలేదు. వితిక కంటే తానే టాస్క్‌లను బాగా ఫర్‌ఫామ్ చేస్తున్నానని.. కానీ తనకు ఇవ్వకుండా, వితికకు ఎందుకు ఇచ్చావని శివజ్యోతి వరుణ్‌ను నిలదీసింది. కేవలం భార్య అయిన కారణంగానే ఆమెకు మూడో స్థానం ఇచ్చాడని వరుణ్‌తో గొడవపడింది శివజ్యోతి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వరుణ్.. శివజ్యోతిని కంత్రీ అంటూ విరుచుకుపడ్డాడు. తన హావభావాలతో వెటకారంగా మాట్లాడాడు.

శివజ్యోతి పట్ల వరుణ్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో వితికను 'పో' అన్నందుకే మహేష్‌ను టార్గెట్ చేసి రెచ్చిపోయాడని.. ఇప్పుడు శివజ్యోతిని అంత మాటనడం సమంజసమేనా అంటూ విరుచుకుపడుతున్నారు. మహిళలంటే రాహుల్‌కు గౌరవం లేదని విమర్శించిన వరుణ్.. ఇప్పుడు శివజ్యోతికి ఇచ్చే గౌరవం ఇదేనా..? అని నిలదీస్తున్నారు. ఇన్నాళ్లు కూల్‌గా, మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌గా నటించిన వరుణ్ సందేశ్ అసలు రంగు..ఇన్నాళ్లకు బయటపడిందని దుమ్మెత్తిపోస్తున్నారు బిగ్‌బాస్ ఫ్యాన్స్. కాగా, వరుణ్-వితిక, శివజ్యోతి ఫైట్‌తో ఈ వారం ఇంట్లో ఉన్న సభ్యులంతా నామినేట్ అయిన విషయం తెలిసిందే.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>