డ్రెస్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదు.. హిమజ విషయంలో నాగార్జున మండిపాటు

Bigg Boss Telugu 3 :  తాజా సీజన్ అప్పుడే మూడో సీజన్ మూడో వారం పూర్తి చేసుకోని.. నాల్గవ వారంలోకి అడుగు పెడుతోంది. అది అలా ఉంటే గత వారం రోజులుగా గొడవలు పడుతున్న ఇంటి సభ్యులందరీకి అదిరిపోయే రీతిలో క్లాస్ పీకాడు హాస్ట్ నాగార్జున.

news18-telugu
Updated: August 11, 2019, 2:06 PM IST
డ్రెస్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదు.. హిమజ విషయంలో నాగార్జున మండిపాటు
బిగ్ బాస్ తెలుగు 3లో నాగార్జున Photo: Instagram.com/starmaa
  • Share this:
Bigg Boss Telugu 3 :  తాజా సీజన్ అప్పుడే మూడో సీజన్ మూడో వారం పూర్తి చేసుకోని.. నాల్గవ వారంలోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే  షోలో హేమ, జాఫర్‌లు మొదటి రెండు వారాల్లో ఎలిమినేట్ కాగా.. మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అది అలా ఉంటే గత వారం రోజులుగా గొడవలు పడుతున్న ఇంటి సభ్యులందరీకి అదిరిపోయే రీతిలో క్లాస్ పీకాడు హాస్ట్ నాగార్జున. ఈ తాజా ఎపిసోడ్‌లో షో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ ప్రవర్తన గురించి మాట్లాడుతూ...ముందుగా ఇంటి సభ్యుడు అలీని 21 గుంజీలు తీయమని చెప్పాడు. అలీతో.. ఆడపిల్ల మీద అలాగేనా అరిచేది. నువ్వు ఏకంగా ఆ అమ్మాయి జేబులో చెయ్యి పెట్టేసి డబ్బును లాక్కుంటున్నావు. అంతేకాకుండా..  చెయ్యి వేసి ఆమెపైనే వ్యక్తిగత దూషణకు దిగావు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు.. నీకు డ్రెస్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ మాత్రం లేదంటూ.. హిమజ విషయంలో అలీ ప్రవర్తనపై నాగార్జున కోపడ్డాడు. దీంతో అలీ సారీ చెప్పాడు.

అంతేకాకుండా నాగార్జున.. గత వారం రోజులుగా జరిగిన పలు సంఘటనలనపై కూడా స్పందించాడు. నామినేషన్ సమయంలో పునర్నవి భూపాలం చేసిన హడావిడి, తమన్నా.. రవితో ప్రవర్తించిన తీరు, కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీముఖి డంబెల్‌తో పగలగొట్టడం.. దాని వల్ల రవికి గాయం అవడం.. అందులో భాగంగా అలీ తోటి ఇంటి సభ్యులు హిమజతో గొడవ పడడం.. ఆ సందర్బంగా రాహుల్.. శ్రీముఖిని తిట్టడం..మొదలగు విషయాలన్నింటిపై నాగార్జున సీరియస్‌ అవుతూ.. వీటికి కారణమైన వారిని మందలిచ్చాడు.  మరోవైపు ఇంటి పెద్దగా ఉన్న బాబా భాస్కర్‌‌కు గురించి మాట్లాడుతూ.. చుట్టూ అంత గొడవ జరుగుతున్నా మౌనంగా ఉండటం ఏంటంటూ కామెంట్‌ చేశాడు నాగార్జున.First published: August 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు