
బాబా భాస్కర్, నాగార్జున
bigg boss 3: తాను ఫినాలే కంటెస్టంట్నని.. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వరుణ్‌తో చెప్పాడు. ఆ మాటలను విన్న నాగార్జున..బాబా భాస్కర్ ఫినాలె టికెట్ ఫేక్ అని స్పష్టం చేశారు.
క్లైమాక్స్‌కు చేరే కొద్దీ బిగ్ బాస్ గేమ్ రసవత్తరంగా మారింది. టైటిల్ వేటలో హౌస్ మేట్స్ టాస్క్‌లు కాకా రేపుతున్నాయి. ఐతే ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్‌కు చేరాడు. హౌస్‌లో టికెట్ టు ఫినాలే గెలిచిన మొదటి కంటెస్టెంట్ రాహులే. ఇక మిగలిన ఐదుగురు సభ్యలు నామినేషన్లో ఉండగా.. శుక్రవారం ప్రజల ఓట్ల ఆధారంగా బాబా భాస్కర్‌ను సేవ్ చేశారు. అంతేకాదు టికెట్ టూ ఫినాలే ఇచ్చి ఫైనల్‌కు పంపారు. దాంతో బాబా భాస్కర్ సంతోషానికి అవధుల్లేవు. చాలా ఆనందంగా ఉందంటూ బిగ్ బాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు భాస్కర్.
ఐతే శనివారానికి సంబంధించిన ప్రోమోలో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. బాబా గెలిచిన టికెట్ టూ ఫినాలే ఫేక్ అని బాంబు పేల్చిన ఆయన.. అందరితో పాటే బాబా కూడా నామినేషన్లో ఉన్నాడని ప్రకటించడు. దాంతో బాబా భాస్కర్‌తో పాటు ఇతర హౌస్ మేట్స్ కూడా షాకవుతారు. ఐతే అంతకంటే ముందు ఫైనల్ గురించి వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ మధ్య చర్చ జరుగుతోంది. ఒక్క వారమైతే బిగ్ బాస్ షో పూర్తవుతుందని వరుణ్ అనడంతో.. దాని గురించి పట్టించుకోనని బాబా అన్నాడు. తాను ఫినాలే కంటెస్టంట్నని.. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వరుణ్‌తో చెప్పాడు. ఆ మాటలను విన్న నాగార్జున..బాబా భాస్కర్ ఫినాలె టికెట్ ఫేక్ అని స్పష్టం చేశారు.
Published by:Shiva Kumar Addula
First published:October 26, 2019, 17:55 IST