• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • BIGG BOSS TELUGU 3 MONAL GAJJAR GET LESS ACCORDING TO SOCIAL MEDIA SHE MAY GETS ELIMINATED SK

Bigg Boss Telugu 4: ఆమెకే తక్కువ ఓట్లు.. ఎలిమినేషన్ ఖాయమా..?

బిగ్ బాస్ లోగో Photo : Twitter

bigg boss telugu 4: మోనాల్, దివికి తక్కువ ఓట్లు వచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరిలో మోనాల్‌కే తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం.

  • Share this:
    Bigg Boss Telugu 4: ఈ వారం ఇంటి నుంచి వెళ్లిపోయేదెవరు? ప్రతి వారం వీకెండ్‌లో దీని గురించే గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక ఈసారి కూడా ఎలిమినేషన్ గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో అవినాష్, సోహెల్, మెహబూబ్, అఖిల్, అభిజీత్, నోయెల్, అమ్మ రాజశేఖర్, దివి, లాస్య, హారిక, మోనాల్, అరియానా ఉన్నారు. ఈ వారం నామినేషన్‌లో అభిజీత్, దివి, మోనాల్, నోయెల్, అరియానా, అవినాష్ ఉన్నారు. ఇప్పటి వరకు ఇంటి నుంచి ఏడుగురు వెళ్లిపోయారు. మొదటి వారం సూర్య కిరణ్, రెండో వారం కరాటే కల్యాణి, మూడో వారం దేవి నాగవల్లి, నాలుగో వారం స్వాతి, ఐదో వారం గంగవ్వ, సుజాత, ఆరోవారం కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు.

    ప్రేక్షకులను మెప్పిస్తేనే ఇంట్లో ఉంటారు. లేదంటే ఎలిమినేట్ అవుతారు. ప్రతి వారం హోస్ట్ నాగార్జున చెప్పే మాట ఇది. వారి ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్ జరుగుతోందని చెబుతారు. ఐతే హౌస్‌లో టాస్క్‌లు మంచిగా ఆడుతూ, యాక్టివ్‌గా ఆడే కంటెస్టెంట్లను ఇంటి నుంచి పంపిస్తున్నారని.. ప్రేక్షకుల ఓట్లకు విరుద్ధంగా ఎలిమినేషన్‌ జరుగుతోందని బిగ్ బాస్‌పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా దేవి ఎలిమినేట్ అయినప్పుడు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవి బలమైన కంటెస్టెంట్ అని.. అలాంటిది ఎలా ఎలిమినేట్ అవుతుందని ప్రశ్నలు గుప్పించారు. అంతేకాదు గత వారం కుమార్ సాయి ఎలిమినేషన్ సమయంలోనూ ఇదే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అతడి కంటే మోనాల్ చాలా వీక్. టాస్క్‌లు ఆడలేదు.. యాక్టివ్‌గా ఉండదు. పులిహోర కలపడం తప్ప ఏమీ చేతకాని నెటిజన్లు ట్వీట్ల మోత మోగించారు.

    ఇలాంటి పరిణామాల మధ్య ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చర్చనీయాంశమైంది. నామినేషన్‌లో అభిజీత్, దివి, మోనాల్, నోయెల్, అరియానా, అవినాష్‌ ఉన్నారు. వీరిలో మోనాల్, దివికి తక్కువ ఓట్లు వచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరిలో మోనాల్‌కే తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం. ఈ క్రమంలో ఏడోవారం ఇంటి నుంచి మోనాలే వెళ్లిపోతుందని లీకు వీరులు ప్రచారం చేస్తున్నారు. మరో రెండు భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని.. మోనాల్, దివి ఇద్దరూ ఎలిమినేట్ అవుతారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆదివారం దసరా పండగ ఉన్నందున.. ఎలిమినేషన్ ఉండకపోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: