BiggBoss: మహేష్‌ను హౌస్ నుంచి గెటవుట్ అన్న శ్రీముఖి..బిగ్‌బాస్ ఆమెకు హెల్ప్ చేస్తున్నాడా ?

బిగ్ బాస్ శ్రీముఖికి ఫేవర్ చేస్తున్నాడని ఒక వైపు ఎలిమినేట్ అయిన హిమజ లాంటి కంటెస్టెంట్లు బహిరంగంగానే స్టేట్ మెంట్స్ ఇస్తుంటే...తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మహేష్ విషయంలో శ్రీముఖి కాస్త సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.

news18-telugu
Updated: October 12, 2019, 9:35 PM IST
BiggBoss: మహేష్‌ను హౌస్ నుంచి గెటవుట్ అన్న శ్రీముఖి..బిగ్‌బాస్ ఆమెకు హెల్ప్ చేస్తున్నాడా ?
శ్రీముఖి (Image : star maa)
news18-telugu
Updated: October 12, 2019, 9:35 PM IST
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ సమయం దగ్గరకు వచ్చేస్తోంది. గత పదకొండు వారాలుగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న బిగ్ బాస్ షోలో, ప్రస్తుతం ఊహకు అందని ట్విస్టులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ శ్రీముఖికి ఫేవర్ చేస్తున్నాడని ఒక వైపు ఎలిమినేట్ అయిన హిమజ లాంటి కంటెస్టెంట్లు బహిరంగంగానే స్టేట్ మెంట్స్ ఇస్తుంటే...తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మహేష్ విషయంలో శ్రీముఖి కాస్త సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. శనివారం విడుదల చేసిన ప్రోమోలో మహేష్ తన విశ్వరూపం చూపించాడు. శ్రీముఖి ప్రతీదీ గేమ్ లో భాగంగానే ఆడుతుందని, ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నామంటూ వాపోయాడు. దీనిపై రియాక్ట్ అయిన శ్రీముఖి మహేష్ ను హౌస్ ను వెళ్లిపోమని చిరాకు పడింది. ఇప్పటికే గేమ్ మొత్తం శ్రీముఖి కోసం ఫిక్స్ అయ్యిందని బిగ్ బాస్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంపై మిగితా కంటెస్టెంట్స్ ఫాలోయర్లు, సోషల్ మీడియా సాక్షిగా శ్రీముఖిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.



First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...