Bigg Boss 3: శ్రీముఖి కోసం రంగంలోకి జబర్తస్త్ టీమ్

జబర్దస్త్ కమెడియన్స్‌తో శ్రీముఖికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. జబర్దస్త్‌లో నటించే చాలా మంది కమెడియన్లు.. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన పటాస్‌ షోలో పాల్గొన్నారు. అంతేకాదు పలు స్టేజి షోలపైనా ప్రదర్శనలు ఇచ్చారు.

news18-telugu
Updated: November 2, 2019, 8:04 PM IST
Bigg Boss 3: శ్రీముఖి కోసం రంగంలోకి జబర్తస్త్ టీమ్
శ్రీముఖి (Star Maa/Photo)
  • Share this:
బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరింది. 3 నెలల క్రితం 15 మంది ఇంటి సభ్యులతో మొదలైన బిగ్ బాస్ ప్రయాణం ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం సాయంత్రం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఫైనల్ బరిలో శ్రీముఖి, రాహుల్, వరుణ్ సందేశ్, అలీ రెజా, బాబా భాస్కర్ పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఎవరు టైటిల్ విన్నర్.. అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఫ్యాన్స్ తమ అభిమాన కంటెస్టెంట్‌ కోసం గ్రూపులుగా ఏర్పడి పోటాపోటీగా ఓట్లు వేశారు.

అంతేకాదు సినీ సెలబ్రిటీలు సైతం వారికే తమ మద్దతంటూ సోషల్ మీడియాలో వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. యాంకర్, ఆర్జే నోయల్... రాహుల్ సిప్లిగంజ్‌కు సపోర్ట్ చేస్తున్నాడు. ఇక తెలుగు బుల్లితెర సంచలనమైన జబర్దస్త్ టీమ్ యాంకర్ శ్రీముఖికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే యాంకర్ రష్మి.. శ్రీముఖికి ఓట్లువేయాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఆటో రాంప్రసాద్‌తో పాటు ఇతర కమెడియన్లు సైతం శ్రీముఖికి మద్దతిస్తున్నారు.

జబర్దస్త్ కమెడియన్స్‌తో శ్రీముఖికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. జబర్దస్త్‌లో నటించే చాలా మంది కమెడియన్లు.. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన పటాస్‌ షోలో పాల్గొన్నారు. అంతేకాదు పలు స్టేజి షోలపైనా ప్రదర్శనలు ఇచ్చారు. అలా వారి మధ్య మంచి సంబంధమే ఏర్పడింది. ఈ క్రమంలోనే శ్రీముఖికి జైకొడుతోంది జబర్దస్త్ బృందం. బిగ్ బాస్ ఫైనల్‌లో విన్నర్ అవ్వాలని కోరుకుంటోంది. ఇక ఆదివారం బిగ్ బాస్ తెలుగు 3 ఫినాలే జరగనుంది. చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్లు సమాచారం. మరి ఈ సీజన్‌లో శ్రీముఖి, రాహుల్ రేస్‌లో ముందున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారన్నది రేపు తెలుస్తుంది.

First published: November 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>