షర్ట్ చింపి ముద్దులు పెట్టారు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంచలనం

Bigg boss: హౌస్‌మేట్స్ తనను విసిగించారని వెల్లడించాడు మహేష్. కింద పడేసి బాడీపై ఆయిల్ పోశారని.. తన మీద పడిపోయి ముద్దులు పెట్టారని చెప్పాడు.

news18-telugu
Updated: October 17, 2019, 3:16 PM IST
షర్ట్ చింపి ముద్దులు పెట్టారు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంచలనం
బిగ్‌బాస్ తెలుగు
news18-telugu
Updated: October 17, 2019, 3:16 PM IST
బిగ్‌బాస్ తెలుగు 3 రియాల్టీ షో 13వ వారం కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. టైటిల్ వేటలో భాగంగా హౌస్‌మేట్స్ ఎవరికి వారు స్కెచ్‌లు వేస్తున్నారు. ఐతే బిగ్‌బాస్‌ హౌస్‌లో 24 గంటలూ కెమెరాలు ఉన్నా.. మనకు చూపించేది మాత్రం డైలీ ఒక గంట ఎపిసోడ్ మాత్రమే..! అంటే హౌస్‌లో జరిగే చాలా విషయాలు మనకు తెలియవు. స్క్రీన్‌పై కనిపించేది మాత్రమే నిజమని అందరూ భావిస్తుంటారు. కానీ తెర వెనక చాలా జరుగుతుంది. ఆ విషయాలను ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మహేష్ విట్టా. బిగ్‌బాస్ హౌస్‌లో తన 12 వారాల జర్నీని పంచుకున్నాడు.

ఓ టాస్క్ సందర్భంగా హౌస్‌మేట్స్ తనకు చుక్కలు చూపించారని చెప్పాడు మహేష్. షర్ట్ చింపేసి ముద్దులు పెట్టారని తెలిపాడు. దెయ్యం టాస్క్‌లో కొందరు దెయ్యాలు, మరికొందరు మనుషులుగా ఉంటారు. ఆ టాస్క్‌లో దెయ్యాల రూపంలో ఉన్న హౌస్‌మేట్స్ తనను విసిగించారని వెల్లడించాడు మహేష్. కింద పడేసి బాడీపై ఆయిల్ పోశారని.. తన మీద పడిపోయి ముద్దులు పెట్టారని చెప్పాడు. ఇంటి సభ్యులు ఏదేదో చేసినా అన్నీ కంట్రోల్ చేసుకున్నానని తెలిపాడు మహేష్.

bigg boss 3 mahesh vitta eliminated 11th week in bigg boss house,bigg boss 3,bigg boss 3 telugu,mahesh vitta,bigg boss 3 mahesh vitta eliminated,baba bhaskar,baba bhaskar nagarjuna,mahesh vitta eliminated,ravi eliminated,ravi eliminated this week,ashu reddy,bigg boss telugu 3,bigg boss 3 ashu reddy,bigg boss telugu season 3,ashu reddy bigg boss,bigg boss,bigg boss ashu reddy,bigg boss 3 telugu promo,bigg boss 3 rohini reddy,bigg boss telugu,ashu reddy bigg boss 3,ashu reddy eliminated,bigg boss 3 contestant ashu reddy,bigg boss 3 contestant ashu reddy details,ashu reddy dubsmash,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 మహేష్ విట్ట,హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మహేష్ విట్ట, అషు రెడ్డి ఎలిమినేషన్,అషు రెడ్డి బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్,బిగ్‌బాస్ 3,రవి బిగ్‌బాస్ హౌస్ 3,బాబా భాస్కర్,బాబా భాస్కర్ కంటతడి,,
మహేష్ విట్ట (Star Maa/Photo)


చివరకు తానూ దెయ్యం అయ్యాయని.. దాంతో శివజ్యోతిని ఏడిపించాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడని చెప్పాడు. టాస్క్‌ కోసం ఆడపిల్లను ఏడిపించకూడదన్న ఉద్దేశంతో ఆ పని చేయలేదని పేర్కొన్నాడు విట్టా. ఐతే టాస్క్‌లో ఫెయిలైన కారణంగా షూస్ పాలిష్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో తనకు కోపం వచ్చిందని తెలిపాడు. ఐతే మిగతా సభ్యులు సర్ధిచెప్పడంతో చివరకు షూస్ పాలిష్ చేశానన్న మహేష్.. ఆ తర్వాత బిగ్‌బాస్‌కు సారీ చెప్పానని వెల్లడించాడు.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...