HOME »NEWS »MOVIE »bigg boss telugu 3 did ali reza made agreement with bigg boss organizer for re entry ba

Bigg Boss 3 Leak | అలీ రెజా, బిగ్ బాస్ మధ్య కుదిరిన అగ్రిమెంట్ లీక్...

Bigg Boss 3 Leak | అలీ రెజా, బిగ్ బాస్ మధ్య కుదిరిన అగ్రిమెంట్ లీక్...
అలీ రెజా (File)

బిగ్ బాస్ హౌస్ నుంచి 49వ రోజు అలీ రెజా ఎలిమినేట్ అయిపోయాడు. 67వ రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి మళ్లీ వచ్చాడు.

  • Share this:
    బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా, బిగ్ బాస్ నిర్వాహకుల మధ్య ఓ డీల్ కుదిరినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి 49వ రోజు అలీ రెజా ఎలిమినేట్ అయిపోయాడు. ఆ ఎపిసోడ్‌లో అలీ రెజాను పట్టుకుని హౌస్ మెంబర్స్ అంతా ఏడవడం.. ఆ సీన్ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. అప్పటి వరకు టాప్ కంటెస్టెంట్‌గా ఉన్న అలీ రెజా తొలిసారి ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వడం, వెంటనే ఎలిమినేట్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆ తర్వాత 67వ రోజు అలీ రెజా బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, రీ ఎంట్రీకి ముందు అలీరెజా, బిగ్ బాస్ నిర్వాహకుల మధ్య ఓ ఒప్పందం కుదిరిందని, అందుకు అలీ ఓకే అన్న తర్వాతే బిగ్ బాస్ హౌస్ డోర్లు తెరుచుకున్నాయనే ప్రచారం జరుగుతోంది.

    బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చినా.. కచ్చితంగా విన్నర్ అయ్యే చాన్స్ లేదని రీ ఎంట్రీకి ముందు అలీ రెజాకు నిర్వాహకులు కరాఖండిగా చెప్పేశారు. ఒకవేళ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తే రన్నరప్‌గా ప్రకటించే చాన్స్ ఉంది. బిగ్ బాస్ నిర్వాహకులు పెట్టిన కండిషన్‌కు ఒప్పుకున్న తర్వాతే అలీ రెజా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఎలిమినేషన్‌కు ముందు ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లను సీరియస్‌గా తీసుకుని పూర్తి చేసే అలీ రెజా.. రీ ఎంట్రీ తర్వాత అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. అంటే ఎలాగూ విన్నర్ కానప్పుడు అంత కష్టపడడం ఎందుకులే అనే అభిప్రాయంతోనే అలీ రెజా అలా చేస్తున్నాడా అనే ప్రశ్నకూడా ఇప్పుడు ప్రేక్షకుల మదిలో మెదులుతోంది.



    PICS : జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం

    Published by:Ashok Kumar Bonepalli
    First published:October 18, 2019, 20:55 IST