Bigg Boss 3 | ఆ ఇద్దరూ ‘కమిట్‌మెంట్‌’ అడిగారు.. రోహిణి సంచలన వ్యాఖ్యలు

Bigg Boss Telugu 3 | పలు టీవీ సీరియల్స్‌తో పాపులర్ అయిన రోహిణి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో సెలక్ట్ అయింది. అయితే, నాలుగో వారం ఆమె ఎలిమినేట్ అయిపోయింది.

news18-telugu
Updated: August 21, 2019, 5:04 PM IST
Bigg Boss 3 | ఆ ఇద్దరూ ‘కమిట్‌మెంట్‌’ అడిగారు.. రోహిణి సంచలన వ్యాఖ్యలు
బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి
news18-telugu
Updated: August 21, 2019, 5:04 PM IST
బిగ్ బాస్ సీజన్ 3 ఫేమ్ రోహిణి తన కెరీర్‌కు సంబంధించి పలు సంచలన విషయాలను చెప్పారు. ఇండస్ట్రీని కుదిపేసిన క్యాస్టింగ్ కౌచ్, కమిట్‌మెంట్లపై ఆమె సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందన్నారు. బీటెక్ చదివిన రోహణి.. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. అయితే, సినిమాల మీద ఉన్న ఆసక్తితో అవకాశాలు వస్తాయన్న ఆశతో పలు సీరియల్స్ ఆఫీసులకు వెళ్లేదట. ఈ క్రమంలో ఓ ఆఫీసులో ఓ వ్యక్తి తనను ‘కమిట్‌మెంట్‌‌’ అడిగారని చెప్పింది. అయితే, రోహిణి ఇచ్చిన సమాధానంతో ఆ ఎపిసోడ్ అక్కడితే అయిపోయిందని చెప్పింది. మరోసారి మరో టీవీ సీరియల్ ఆడిషన్స్ కోసం వెళితే అక్కడ కూడా తనకు అదే ప్రశ్న ఎదురైందని చెప్పింది. దీంతో నో చెప్పి వచ్చేశానని తెలిపింది. పలు టీవీ సీరియల్స్‌తో పాపులర్ అయిన రోహిణి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో సెలక్ట్ అయింది. అయితే, నాలుగో వారం ఆమె ఎలిమినేట్ అయిపోయింది.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...