Bigg Boss Telugu 3: ఇవాళే ఎలిమినేషన్.. బిగ్‌బాస్ షాకింగ్ నిర్ణయం

ఊహించని ఈ పరిణామాన్ని చూసి వరుణ్ సందేశ్ కంటతడిపెడతాడు. ఇంటి నుంచి వెళ్తున్నందుకు తనకు ఎలాంటి బాధలేదని చెప్పి మహేష్ ఇంటి నుంచి గేట్ వద్దకు వెళ్తాడు.

news18-telugu
Updated: September 13, 2019, 7:44 PM IST
Bigg Boss Telugu 3: ఇవాళే ఎలిమినేషన్.. బిగ్‌బాస్ షాకింగ్ నిర్ణయం
బిగ్‌బాస్ తెలుగు
news18-telugu
Updated: September 13, 2019, 7:44 PM IST
Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ హౌస్‌లో 54వ రోజు షాకింగ్ ఘటన జరిగింది. వీకెండ్‌కు ముందే హౌస్ నుంచి ఓ కంటెస్టెంట్ వెళ్లిపోయాడు. కమెడియన్ మహేష్ విట్టాను ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. స్టోర్‌రూమ్‌కి వెళ్లిన కెప్టెన్ వితిక.. అక్కడ సూట్‌కేసు చూసి ఆశ్చర్యపోతుంది. అది మహేశ్ సూట్‌కేస్ అని తెలియడంతో హౌస్‌మేట్స్ ఒక్కసారిగా షాక్ అవుతారు. మహేష్ సూట్‌కేస్ కోపంతో బెడ్‌‌పై విసిరేసి బట్టలు సర్దుకుంటాడు. ఊహించని ఈ పరిణామాన్ని చూసి వరుణ్ సందేశ్ కంటతడిపెడతాడు. ఇంటి నుంచి వెళ్తున్నందుకు తనకు ఎలాంటి బాధలేదని చెప్పి మహేష్ ఇంటి నుంచి గేట్ వద్దకు వెళ్తాడు. అతడిని సాగనంపేందుకు ఇంటి సభ్యులంతా అతడితో వెళ్తారు.

ఇవాళ్టి ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ తతంగం కనిపించింది. ఐతే హౌస్ నుంచి మహేష్ నిజంగా వెళ్లిపోలేదు. మహేష్ గేట్ దాక వెళ్లే వరకు మాత్రమే ప్రోమోలో చూపించారు. వాస్తవానికి అతడికి బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ అప్పగించాడు. తనను ఇంటి నుంచి పంపిస్తున్నట్లుగా హౌస్‌మేట్స్‌ని నమ్మించాలని ఆదేశిస్తాడు. దాని ప్రకారమే మహేష్ నడుచుకున్నాడు. మరి అతడి నటనను ఇంటి సభ్యులు నమ్ముతారా? సీక్రెట్ టాస్క్‌ని మహేష్ విజయవంతంగా పూర్తి చేశాడా? ఒకవేళ సక్సెస్ ఐతే మహేష్‌కి బిగ్‌బాస్ ఇచ్చే గిఫ్ట్ ఏంటి? అనేది తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..!


First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...