వితిక ముందే అలా చేస్తాడా.. బాబాపై పునర్నవి ఫైర్

మొదట వరుణ్‌ అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదన్న పునర్నవి... భార్య కోసం ఇతరులపై అరుస్తున్నాడని అందరూ అనుకునేవారని చెప్పింది.

news18-telugu
Updated: October 14, 2019, 7:08 PM IST
వితిక ముందే అలా చేస్తాడా.. బాబాపై పునర్నవి ఫైర్
పునర్నవి భూపాలం
news18-telugu
Updated: October 14, 2019, 7:08 PM IST
బిగ్‌బాస్ హౌస్ నుంచి 11వ వారం వెళ్లిపోయింది లేడీ మోనార్క్ పునర్నవి భూపాలం. బిగ్‌బాస్ హౌస్ నుంచి సొంతింటికి చేరుకున్న 'ఉయ్యాలా జంపాలా' బ్యూటీ.. తన బిగ్‌బాస్ జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ రియాల్టీ షో తనకు మంచి ఎక్స్పీరియన్స్ అని తెలిపింది. బిగ్‌బాస్‌ను ఛాలెంజింగ్‌గా మాత్రమే తీసుకున్నానని.. అంతేతప్ప బిగ్‌బాసే తన లైఫ్‌ అని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టంచేసింది. రిక్షా టాస్క్‌లో వితిక ముందే బాబా భాస్కర్ మూత్ర విసర్జన చేయాలనుకున్నారన్న పునర్నవి.. అది తనకు నచ్చలేదని వెల్లడించింది. కానీ సీజన్ 1, 2లో అలానే చేశారంటూ శ్రీముఖి, శివజ్యోతి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారని విమర్శించింది.

ఇక తనకు పుస్తకాలు చదవడం ఇష్టమని చెప్పింది పునర్నవి. హౌస్‌లో చెట్టు వద్ద కూర్చొని.. ఓ పుస్తకం ఇవ్వమని బిగ్‌బాస్‌ను రోజూ అడిగేదాన్నని తెలిపింది. ఒక్క బుక్ తెప్పిస్తే చదువుకుంటానని ఎన్ని సార్లు అడిగినా.. బిగ్‌బాస్ తన కోరికను నెరవేర్చలేదని వెల్లడించింది. మొదట వరుణ్‌ అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదన్న పునర్నవి... భార్య వితిక కోసం ఇతరులపై అరుస్తున్నాడని అందరూ అనుకునేవారని చెప్పింది. వరుణ్, వితికతో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవడం వల్లే వారితో కలవగలిగానని చెప్పుకొచ్చింది పునర్నవి. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ నూతన్ నాయుడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిగ్‌బాస్ జర్నీని షేర్ చేసుకుంది.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...