బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో ఈ రోజు ఎపిసోడ్లో బాబా భాస్కర్ మాస్టర్ బిగ్ బాస్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. బాబా మాస్టర్‌ను సీక్రెట్ రూమ్‌కి పిలిచాడు బిగ్ బాస్. అక్కడ కొన్ని తినే పదార్థాలు పెట్టారు. వాటిని తిన్న తర్వాత డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత ఒకటి నుంచి 100 వరకు అంకెలు లెక్కబెట్టాలని సూచించాడు. అవి పూర్తయ్యాక మళ్లీ వంద నుంచి ఒకటి వరకు వెనుకకు లెక్కబెట్టాలని కోరాడు. అయితే, మధ్యలో కొన్ని అంకెలను వదిలేశాడు బాబా బాస్కర్ మాస్టర్. అంతటితో అయిపోలేదు. ఆ తర్వాత ఏబీసీడీలు వచ్చా అని బాబా మాస్టర్‌ను బిగ్ బాస్ అడిగాడు. అయితే, తనకు రావని చెప్పినా వినలేదు. ఏబీసీడీలను వెనుక నుంచి చెప్పాలని ఆర్డర్ వేశాడు. దీంతో తడుముకుంటూనే చెప్పాడు బాబా భాస్కర్ మాస్టర్. మధ్య మధ్యలో కొన్ని అక్షరాలు వదిలేశాడు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో సభ్యుల వద్ద ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకోవాల్సిందిగా శేఖర్ మాస్టర్‌కి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ విషయం బిగ్ బాస్ హౌస్‌లో సభ్యులకు చెప్పాడు. అయితే, అతడు చెప్పింది నిజమేనని చాలా మంది నమ్మారు.
పునర్నవి, శివజ్యోతిలకు బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. శివజ్యోతిని తెలుగు పద్యాలు చెప్పమన్నాడు. పునర్నవిని నర్సరీ రైమ్స్ చెప్పాలని సూచించాడు. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్‌కు 50 గుంజీళ్లు తీసి, పది డ్రింక్స్ తాగాలని టాస్క్ ఇచ్చాడు.
Published by:Ashok Kumar Bonepalli
First published:September 13, 2019, 21:59 IST