
బాబా భాస్కర్, నాగార్జున
తాజాగా గేమ్ నుంచి ఎలిమినేట్ అయిన వరుణ్ సైతం ఇదే విషయాన్ని తేల్చాడు. అంతేకాదు శ్రీముఖి, రాహుల్ కు మాత్రమే టైటిల్ విన్నర్ చాన్స్ ఉందని తేల్చేసాడు.
బిగ్ బాస్ హౌస్ లో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ, షోను ఒక ఎంటర్టైనర్ గా మార్చిన ఘనత కేవలం బాబా భాస్కర్ కే చెందుతుంది. అయితే బాబా భాస్కర్ మాత్రం టైటిల్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లేనని వార్తలు వస్తున్నాయి. ఓట్ల పరంగా చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో రాహుల్, శ్రీముఖి ముందు వరుసలో నిలిచారని తెలుస్తోంది. తాజాగా గేమ్ నుంచి ఎలిమినేట్ అయిన వరుణ్ సైతం ఇదే విషయాన్ని తేల్చాడు. అంతేకాదు శ్రీముఖి, రాహుల్ కు మాత్రమే టైటిల్ విన్నర్ చాన్స్ ఉందని తేల్చేసాడు. దీంతో బాబా భాస్కర్ కేలం ఆటలో అరటిపండుగా మిగిలిపోయాడనే నెటిజన్లు జాలి చూపిస్తున్నారు. అంతేకాదు అసలు బిగ్ బాస్ హౌస్ లో అందరూ గేమ్ గెలవాలని ఆడితే బాబా భాస్కర్ మాత్రం కేవలం తనదైన శైలిలో హౌస్ లో నవ్వులు పూయించాడు.
Published by:Krishna Adithya
First published:November 03, 2019, 20:31 IST