బిగ్ బాస్ శ్రీముఖి అభిమానులకు గుడ్ న్యూస్..

తన అభిమానుల కోసం బిగ్ బాస్ రన్నరప్ శ్రీముఖి ఓ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేయనుంది.

news18-telugu
Updated: November 15, 2019, 6:45 PM IST
బిగ్ బాస్ శ్రీముఖి అభిమానులకు గుడ్ న్యూస్..
అంతేకాదు.. తనకు కాబోయే వాడు తనతో చాలా ఇన్నోసెంట్‌గా ఉండాలని కోరుకుంటుంది. బేబీ అంటూ చనువుగా ఉండాలని.. ఇలాంటి చిన్నచిన్న కోరికలు తనకు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది ఈ బొద్దుగుమ్మ.
  • Share this:
తన అభిమానులకు యాంకర్, బిగ్ బాస్ రన్నరప్ శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్పింది. బిగ్ బాస్ హౌస్‌లో తన 105 రోజుల ప్రయాణంలో ఎంతగానో సహకరించిన అభిమానుల కోసం ఆమె కొత్తగా ఓ నిర్నయం తీసుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో తనకు చివరి వరకు అండగా నిలిచిన అభిమానులను కలవాలని శ్రీముఖి నిర్ణయించింది. ఈ క్రమంలో ఆమె త్వరలోనే ఓ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేయబోతోంది. ఫ్యాన్స్‌ను ఎప్పుడు కలవాలి? ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలనే దానిపై శ్రీముఖి టీమ్ కసరత్తు చేస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది. ఆ వెంటనే ఫ్యాన్స్‌ కోసం ఆ వివరాలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేయనున్నారు. హైదరాబాద్‌లోనే ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేయాలని శ్రీముఖి టీమ్ భావిస్తోంది. మొదట హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత సినిమా షోలు, ఇతర ప్రోగ్రామ్స్ కోసం వేర్వేరు నగరాలు, పట్టణాలకు వెళ్లినప్పుడు అక్కడ తన అభిమానులను ప్రత్యేకంగా కలవనుంది.
First published: November 15, 2019, 6:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading