HOME »NEWS »MOVIE »bigg boss telugu 3 ali reza eliminated from house for this week episode mk

Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ నుంచి అలీరెజా ఔట్...షాక్‌లో శ్రీముఖి

Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ నుంచి అలీరెజా ఔట్...షాక్‌లో శ్రీముఖి
అలీరెజా, శ్రీముఖి

అలీ రెజాను అందరూ టఫ్ కంటెస్టెంట్ అనుకుంటున్నప్పటికీ, ప్రేక్షకులు అతనికి ఎందుకు షాక్ ఇచ్చారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

  • Share this:
    Bigg Boss Telugu 3:  బిగ్ బాస్ లో ఈ సారి ఎలిమినేషన్ కత్తి అలీరెజాను వెంటాడింది. ఆదివారం ఎపిసోడ్ లో  హౌస్ మేట్స్ రవి, శ్రీముఖి, అలీరెజా, మహేష్ లను సెపరేట్ బ్లాక్స్ లలో నిలుచోబెట్టి వారిలో ఎవరిపై అయితే స్పాట్ లైట్ ఆగుతుందో వారు సేఫ్ అని కొత్త గేమ్ కు తెరలేపారు. దీంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపేలా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. అయితే అందరూ అంచనాలను తారుమారు చేస్తూ  బిగ్ బాస్ నుంచి అలీరెజా ఎలిమినేట్ చేశారు. అయితే ఇప్పటి వరకూ అలీరెజా నామినేషన్స్ ఎదుర్కోలేదు. దీంతో అలీరెజా ఎలిమినేషన్ ను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఎవరూ నమ్మడం లేదు.

    తొలిసారి నామినేషన్స్ ఎదుర్కొంటున్న అలీకి బిగ్ బాస్ షాకివ్వనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో షికారు వినిపించాయి. ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో హేమ, జాఫర్; తమన్నా, రోహిణి, అషు ఎలిమినేషన్స్ విషయంలో ఈ ప్రిడిక్షన్స్ 100 శాతం కరెక్టుగా ప్రూవ్ అయ్యాయి. మరి అలీ రెజాను అందరూ టఫ్ కంటెస్టెంట్ అనుకుంటున్నప్పటికీ, ప్రేక్షకులు అతనికి ఎందుకు షాక్ ఇచ్చారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

    Published by:Krishna Adithya
    First published:September 08, 2019, 22:08 IST