HOME »NEWS »MOVIE »bigg boss telugu 3 ali reza did not nominated in house till date sk

Bigg Boss: హౌజ్‌లో ఒకే ఒక్కడు...5 వారాలుగా నో నామినేషన్

Bigg Boss: హౌజ్‌లో ఒకే ఒక్కడు...5 వారాలుగా నో నామినేషన్
ఒకవేళ కుదరని పక్షంలో అతడు ఇంటి ముఖం పట్టాల్సిందే.. ఒకటి రెండు వారాలు అయిన తర్వాత పూర్తిగా కోలుకున్నాక మధ్యలో వచ్చే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు.

ఈ వీకెండ్‌లో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు పునర్నవి, హిమజ, రాహుల్, రవికృష్ణ, మహేశ్ నామినేట్ అయ్యారు. ఇక కెప్టెన్ తన కెప్టెన్సీ పవర్‌తో వరుణ్‌ను నేరుగా నామినేట్ చేసింది.

  • Share this:
    Bigg Boss Telugu3: హౌజ్‌మేట్స్ మధ్య ఆట రసవత్తరంగా మారింది. రోజులు గడిచేకొద్దీ ఇంటి సభ్యులు మాస్క్ తీసి ఒరిజినల్ క్యారెక్టర్‌లోకి రావడంతో గేమ్ మరింత రక్తి కడుతోంది. 5 వారాలు గడవడంతో ఇంట్లో ఎవరు స్ట్రాంగ్..? ఎవరు వీక్..? ఎవరు గుడ్..? ఎవరు వేస్ట్..? అనే దానిపై ఇటు హౌజ్‌మేట్స్‌లోనూ, అటు ఆడియెన్స్‌‌లోనూ మెల్లగా క్లారిటీ వస్తోంది. అందుకే నామినేషన్ల ఘట్టం ఆసక్తిగా సాగుతోంది. ఇక సోమవారం కూడా యథావిధిగా నామినేషన్స్ జరిగాయి. ఈసారి ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.

    11 మంది ఇంటి సభ్యుల్లో కెప్టెన్ శివజ్యోతిని తప్పించి..మిగిలిన 10 మందిన 5 జంటలుగా విడగొట్టారు. ఒక్కో జంట నుంచి ఒకరిని ఇంటి సభ్యులు నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో మిగతా ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌కు చెప్పారు. ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నారో కారణం కూడా వివరించారు. ఈ వీకెండ్‌లో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు పునర్నవి, హిమజ, రాహుల్, రవికృష్ణ, మహేశ్ నామినేట్ అయ్యారు. ఇక కెప్టెన్ శివజ్యోతి తన కెప్టెన్సీ పవర్‌తో వరుణ్‌ను నేరుగా నామినేట్ చేసింది. దాంతో మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.



    ఐతే ఈ 5 వారాల్లో దాదాపు అందరు సభ్యులు ఏదో ఒక సందర్భంలో నామినేట్ అయ్యారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఇప్పటి వరకు నామినేషన్‌కి వెళ్లలేదు. అతడే అలీ రాజా..! బిగ్‌బాస్ హౌజ్‌లో స్ట్రాంగెస్ట్ పర్సన్. టాస్క్‌ల్లో మాత్రమే కాదు..హౌజ్‌లో ఏదైనా గొడవ జరిగినా అందులో కలగజేసుకొని తన వర్షన్ గట్టిగా వినిపిస్తాడు. ముక్కోపిగా పేరున్నప్పటికీ.. ఇంటి సభ్యులందరూ అతడిని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావిస్తుంటారు. అందుకే అతడు ఇప్పటి వరకు నామినేషన్స్‌కు రాలేదు. కాగా, బిగ్‌బాస్ హౌజ్ నుంచి తొలివారంలో హేమ, ఆతర్వాత వరుసగా జాఫర్, తమన్నా, రోహిణి, అషురెడ్డి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:August 26, 2019, 22:43 IST