బిగ్ బాస్-2 కంటెస్టెంట్స్ వీళ్లేనట..!

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:21 PM IST
బిగ్ బాస్-2 కంటెస్టెంట్స్ వీళ్లేనట..!
బిగ్ బాస్
  • News18
  • Last Updated: June 6, 2018, 3:21 PM IST
  • Share this:
బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ సూపర్ సెక్సెస్ అయింది. అదే ఊపుతో ఈ సారి సరికొత్తగా ముస్తాబువుతోంది బిగ్ బాస్-2.  నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయబోతున్నారు. ఏదైనా జరగొచ్చంటున్న బిగ్ బాస్ టీజర్ .. అప్పుడే అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. జూన్ 10 నుంచి ప్రారంభం కానున్న రెండో సీజన్..  100 రోజుల పాటు జరగనుంది.  ఇందులో 16 మంది సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు.

కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో ఆ 16 మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే  లిస్టులో ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి పేరు కూడా వినిపించడంతో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్-2 లో పాల్గొనబోతున్నారని ప్రచారంలో ఉన్న పేర్లు ఓ సారి చూద్దాం.


  1. శ్రీరెడ్డి, నటి

  2. గీతా మాధురి, సింగర్

  3. ఛార్మి, హీరోయిన్

  4. శ్యామల, యాంకర్
  5. రాశి, నటి

  6. లాస్య, యాంకర్

  7.  గజాలా, నటి

  8. చాందిని చౌదరి, నటి

  9. జూనియర్ శ్రీదేవి, హీరోయిన్

  10.  ధన్య  బాలక్రిష్ణ, నటి

  11. తరుణ్, హీరో

  12.  వరుణ్ సందేశ్, హీరో

  13. ఆర్యన్ రాజేశ్, హీరో

  14. వైవా హర్ష, కమెడియన్

  15. వేణు, కమెడియన్

  16. తనీశ్, హీరో


ప్రస్తుతం ఈ లిస్టుపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ సారి సామాన్యులకు కూడా బిగ్ బాస్ షోలో అవకాాశం ఉంటుందని  నిర్వాహకులు ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది.  మరి  ఈ లిస్టులో ఉన్న  వారిలో ఎంత మంది బిగ్ బాస్ హౌజ్ లో కనిపిస్తారు. సామాన్యుడి కేటగిరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే జూన్ 10 వరకు  ఆగాల్సిందే.

బిగ్ బాస్ తొలి సీజన్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి..ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు.  ఆ సీజన్ లో శివ బాలాజీ విన్నర్ గా నిలిచి రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్ ను అందుకున్నాడు. ఇక ఈ సీజన్ 100 రోజుల పాటు ఉంటుంది. 60 కెమెరాలు కంటెస్టులను గమనిస్తూ ఉంటాయి. ఐతే శ్రీరెడ్డి పేరుపై ప్రచారం జరగడం ఆసక్తిగా మారింది. ఆమె  హీరో నానిపైనా సంచలన ఆరోపణలు చేశారు. ఈ షోకు ఆయనే హోస్ట్. ఒక వేళ అదే నిజమైతే.. బిగ్ బాస్-2 మరింత రంజుగా ఉండే అవకాశముంది.
Published by: Shiva Kumar Addula
First published: May 30, 2018, 6:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading