• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS TAMIL SEASON 1 WINNER AARAV NAFEEZ FATHER NIDAAN DIES DUE TO HEART ATTACK PK

Bigg Boss Winner: బిగ్ బాస్ విన్నర్ ఇంట్లో విషాదం.. గుండెపోటుతో తండ్రి కన్నుమూత..

Bigg Boss Winner: బిగ్ బాస్ విన్నర్ ఇంట్లో విషాదం.. గుండెపోటుతో తండ్రి కన్నుమూత..

తమిళ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ ఆరవ్ నఫీజ్ (Aarav Nafeez father passed away)

Bigg Boss Winner: బిగ్ బాస్ అనే పదం ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి ఒక్కరోజు కూడా పూర్తి కాలేదు. దాంతో అంతా ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఇదే..

  • Share this:
బిగ్ బాస్ అనే పదం ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి ఒక్కరోజు కూడా పూర్తి కాలేదు. దాంతో అంతా ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అభిజీత్ విన్నర్ కావడం.. సోహెల్ మూడోస్థానంలో ఉండి 25 లక్షలు గెలవడం.. రన్నరప్ అయి కూడా ఆటలో అరటిపండులా అఖిల్ సార్థక్ మిగిలిపోవడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇంతలోనే ఓ చేదు వార్త వచ్చింది. బిగ్ బాస్ కుటుంబంలోనే విషాదం జరిగింది. ఈ షో కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మరిన్ని భాషల్లో కూడా పాపులర్. అలాంటి బిగ్ బాస్ నుంచి పాపులర్ అయిన ఓ విన్నర్ తండ్రి కన్నుమూసాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి బిగ్ బాస్ మొదలు పెట్టారు. ఇక్కడ తొలి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే.. తమిళంలో మొదట్నుంచీ కమల్ ఉన్నాడు. ఇదిలా ఉంటే తమిళ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ ఆరవ్ నఫీజ్ ఇంట విషాదం జరిగింది. ఆయన తండ్రి నిదాన్ డిసెంబర్ 20న గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలో ఆయన మృతి చెందగా అంత్యక్రియలని స్వస్థలం నాగర్ కోల్‌లో జరిపించారు కుటుంబ సభ్యులు. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆరవ్.. 2016లో వచ్చిన బేతాళుడుతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చి విన్నర్ అయ్యాడు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఆరవ్. ఈయన తండ్రి మరణ వార్త తెలిసి పలువురు ఆరవ్ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసారు.
Published by:Praveen Kumar Vadla
First published: