Bigg Boss: బిగ్‌బాస్ హోస్ట్‌పై కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు..

నటుడు కమల్‌హాసన్‌పై నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బంధుప్రీతి ఎక్కువని.. తనకు వచ్చిన ఆఫర్‌ను కమల్, తన కూతురు ఇప్పించాడంటూ ఆమె ఆరోపణలు చేయడం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.

news18-telugu
Updated: October 18, 2019, 2:45 PM IST
Bigg Boss: బిగ్‌బాస్ హోస్ట్‌పై కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు..
ప్రతీకాత్మకచిత్రం
news18-telugu
Updated: October 18, 2019, 2:45 PM IST
నటుడు కమల్‌హాసన్‌పై నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బంధుప్రీతి ఎక్కువని.. తనకు వచ్చిన ఆఫర్‌ను కమల్, తన కూతురు ఇప్పించాడంటూ ఆమె ఆరోపణలు చేయడం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన మీరా.. కమల్ హాసన్ అనుకున్నది సాధించారంటూ ట్వీట్ చేసింది.వివరాలలోకి వెళితే .. మీరా మిథున్ కథానాయికగా ‘అగ్ని సిరాగుగల్’ అనే సినిమాలో నటించాల్సి ఉంది. అయితే సినిమాలో ఆమెను తీసుకున్నట్లే తీసుకుని ఆ తర్వాత తొలగించేశారట. ఆమె ప్లేస్‌లో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్‌ను ఎంపిక చేసుకున్నారట. సినిమా నుంచి నన్ను తప్పించి తన కూతురికి అవకాశం వచ్చేలా చేశారు కమల్ హాసన్. ఇలా చేసినందుకు దర్శకుడు నవీన్‌కు, అక్షరా హాసన్‌కు, నిర్మాత శివకు సిగ్గుగా అనిపించడంలేదా? వారికి డబుల్ స్టాండర్డ్స్ బుద్ధి ఉందని బాగా తెలుస్తోంది’ అని మీరా ట్వీట్ చేసింది. అయితే మీరా చేస్తున్న ఆరోపణలపై దర్శకుడు నవీన్ స్పందించారు. ‘అగ్ని సిరాగుగల్ సినిమాలో మొదట షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నాం.

bigg boss tamil contestant meera mithun sensational comments on kamal haasan,bigg boss,bigg boss tamil,bigg boss 3 telugu,bigg boss telugu 3,kamal haasan,meera mithun,meera mithun,meera mithun audio,meera mithun interview,meera mithun latest video,kamal haasan,meera mithun issue,meera mithun evicted,meera mithun bigg boss,meera mitun,kamal haasan bigg boss,meera mithun dance,meera mithun latest,meera mithun latest news,meera mithun leaked audio,kamal hassan,meera mithun controversial,meera,joe michael meera mithun,meera mithun cheran,meera mithun phone call,kollywood,tollywood,కమల్ హాసన్,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ తెలుగు,కమల్ హాసన్ మీరా మిథున్,మీరా మిథున్,కమల్ హాసన్ పై మీరా మథున్ సంచలన వ్యాఖ్యలు
కమల్ హాసన్, మీరా మిథున్ (Facebook/Photo)


ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో అక్షర హాసన్‌ను తీసుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాలో అక్షర హాసనే కథానాయిక. అసలు సినిమాలో మీరా మిథున్‌ను ఎంపిక చేసుకోలేదు. నా అనుమతి లేకుండా సినిమాలో తనను ఎంపిక చేసుకున్నామని మీడియా ముందుకు వచ్చి ఆరోపిస్తోంది. మొదట నేను ఆమె మాటలు పట్టించుకోకూడదని అనుకున్నాను. కానీ ఆమె చేస్తున్న రాద్దాంతం వల్ల స్పందించాల్సి వస్తోంది అని తెలిపారు. ఈ వ్యాక్యలపై మరోసారి స్పందించింది మీరా . ‘‘మాటలు జాగ్రత్త. ఒక స్త్రీని డాక్టర్‌ని కలవమని చెప్పే అధికారం మీకెవరు ఇచ్చారు? ‘అగ్ని శిరగుగళ్‌’ సినిమా గురించి, నా పాత్ర గురించి మనం మాట్లాడినట్లు నిర్ధారించడానికి నా దగ్గర ఆడియో ఉంది.అది కనుక నేను బయటపెడితే మీకొక్కరికే కాదు మీ కుటుంబంలో ఉన్న స్త్రీల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. మరి.. నేను బయటపెట్టనా? ఎదుర్కొనే గట్స్‌ మీకున్నాయా?’’ అని ట్వీట్‌ చేశారు మీరా. అందుకు నవీన్‌ నుంచి సమాధానం రాకపోవడంతో ‘‘ఏమైంది నవీన్‌ కుమార్‌. ఎందుకు సైలెంట్‌ అయిపోయారు. సవాల్‌ని ఎదుర్కోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు’’ అని ట్వీట్‌ చేశారు.ఇలా వాడివేడి ట్వీట్స్‌తో మీరా మిథున్‌ టాక్‌ ఆఫ్‌ కోలీవుడ్‌ అయ్యారు. అయితే ఈ వివాదం గురించి కమల్, అక్షరా నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి.. స్పందిస్తారో? సైలెంట్‌గా ఉండిపోతారో చూడాలి.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...