Casting Couch-Kasturi : నేను కూడా బాధితురాలినే... సీనియర్ నటి కస్తూరి..

Payal Ghosh-Kasturi Shankar : 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ ఘోష్ ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 23, 2020, 11:29 AM IST
Casting Couch-Kasturi : నేను కూడా బాధితురాలినే... సీనియర్ నటి కస్తూరి..
కస్తూరి శంకర్ Photo : Twitter
  • Share this:
పాయల్ ఘోష్.. మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ ఇటీవల సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు అనురాగ్ కశ్యప్  తనను లైంగికంగా వేధించాడని ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఓ సందర్భంలో తనకు కథ చెబుతానని చెప్పిన అనురాగ్ కశ్యప్.. తన గదిలోకి తీసుకెళ్లాడని .. ఆ సమయంలో అనురాగ్‌ కశ్యప్‌ 'బాంబే వెల్‌వెట్‌' సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడని చెప్పింది. అయితే ఆ సినిమాలో నటించాలనుకుంటే తనతో పడక సుఖాన్ని పంచుకోవాలని.. తనతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తానని చెప్పినట్టు పాయల్ పేర్కొంది. సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద తప్పేం కాదన్నట్లు చెప్పాడు.  అంతేకాదు తనకు శారీరక సుఖాన్ని అందించాలని కోరుతు తనను తాకాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో తను ఎలాగో అలా తప్పించుకొని వచ్చినట్టు చెప్పింది పాయల్. అనురాగ్‌పై పాయల్ చేసిన ఆరోపణలు బాలీవుడ్‌‌లో తీవ్ర దుమారాన్ని లేపాయి.


ఈ నేపథ్యంలో సౌత్‌కు చెందిన సీనియర్ హీరోయిన్ తనకు జరిగిన లైంగిక వేధింపులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అప్పట్లో తన అందచందాలతో అలరించిన నటి కస్తూరి.. తనకు కూడా ఇలాంటీ వేధింపులు జరిగాయని పేర్కోంది. పాయల్ విషయంలో మాట్లాడుతూ.. అనురాగ్ పై చేసిన ఆ ఆరోపణలు కోర్టులో నిలవలేవని పేర్కోంది. పాయల్ ఘోష్ ఆరోపణలపై స్పందిస్తూ, తన న్యాయపరమైన అభిప్రాయాన్ని పంచుకుంది. కస్తూరి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేస్తూ... అనురాగ్ కశ్యప్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఉద్దేశిస్తూ.. స్పష్టమైన, ధృవీకరించే ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు నిరూపించటం అసాధ్యం. అయితే ఈ ఆరోపణలు మాత్రం ఇద్దరిలో ఒకరి జీవితాన్ని నాశనం చేస్తాయి అని పేర్కోంది. అయితే ఈ వ్యాఖ్యలను చూసిన ఓ నెటిజన్.. ఇలా మీ కుటుంబంలో గానీ, లేదా మీకు దగ్గరగా ఉన్న ఎవరికైనా జరిగితే ఇలానే మీరు చట్టపరమైన అభిప్రాయాన్ని ప్రస్తావిస్తారా.. అని ప్రశ్నించగా.. నా కుటుంబంలో కాదు.. నాకే జరిగిందని పేర్కోంది. అయితే తనను వేధించిన వ్యక్తి గురించి మాత్రం ఇక్కడ వెల్లడించలేదు.




ఇక కస్తూరి సినిమాల విషయానికి వస్తే.. భారతీయుడులో లో పెద్ద కమల్ హాసన్‌కు కూతురిగా నటించిన కస్తూరి.. ఆ తర్వాత తెలుగులో నిప్పురవ్వ, అన్నమయ్య లాంటి ఎన్నో చిత్రాల్లో నటించి అదరగొట్టింది. ప్రస్తుతం కస్తూరి తెలుగు పాపులర్ సీరియల్ గృహ లక్ష్మి లో నటిస్తోంది. ఇక కస్తూరి.. ఆ మధ్య చేసిన బోల్డ్ ఫోటో షూట్ విమర్శలకు తావిచ్చింది. అమ్మ గొప్పదనాన్ని తెలుపుతూ.. ఆమె ఆ ఫోటోల్లో కొంత బోల్డ్‌గా కనిపించింది.
Published by: Suresh Rachamalla
First published: September 23, 2020, 9:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading