Bigg Boss Telugu 5 : బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లేది వీళ్లే..!

ప్రతీకాత్మక చిత్రం

Bigg Boss Telugu 5 : ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని.. ఐదో సీజన్ కూడా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్లో మిగిలిన 13 మంది కంటెస్టెంట్లలో తర్వాత ఇంటి నుంచి బయటకు పంపంచేది వాళ్లనే అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

 • Share this:
  ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss). ఇప్పటికే నాలుగు సీజన్లు(Seasons) విజయవంతంగా పూర్తి చేసుకొని.. ఐదో సీజన్ కూడా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ బిగ్ బాస్ షో సీజన్ 5 ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయినప్పటికీ ఈ షోకు పరవాలేదనిపించే స్థాయిలో రేటింగ్స్(Ratings) వస్తుండటం గమనార్హం. టీఆర్పీ రేటింగ్(Trp Ratings) ను పెంచుకోవడానికి బిగ్ బాస్(Bigg Boss) నిర్వాహకులు సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు గొడవలు పడుతుండగా ప్రేక్షకులకు పరిచయం లేని కంటెస్టెంట్లు ఎక్కువమంది ఉండటం షోకు మైనస్ గా మారింది.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఏంట్రీ..! అందుకే లోబో సీక్రెట్ రూంలోకి..?


  ఇక హౌస్ లో కాస్తంత టెన్షన్ వాతావరణం కల్పిద్దామని ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. అందులో లోబోను ఫేక్ ఎలిమినేట్ చేయగా.. సీక్రెట్ రూంలోకి పంపించారు. ఇక శ్వేతను శాశ్వతంగా ఇంటికి పంపించేశారు. దీంతో హౌస్ లో ఇక 12 మంది మాత్రమే ఉన్నారు. లోబోతో కలిపితే మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. లోబోకు హౌస్ లో అన్ కంఫర్ట్ గా ఉందని.. తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.

  తనను ఎలిమినేట్ చేసేయండి అని ఇన్ డైరెక్ట్ గా అన్నట్లు కనిపిస్తోంది. ఇక హౌస్ లో ఆట విషయానికి వస్తే.. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో వారంలోకి అడుగు పెట్టింది. వారాలు గడుస్తున్నా కొద్దీ హౌజ్ లో అసలైన ఆట ఆడే వారినే ఆడియెన్స్ ఉంచుతున్నారు.

  పెళ్లయిన వెంటనే ఆట ఆడారు.. దానిలో వరుడికి తగలకూడని చోట దెబ్బతగిలింది.. గిలగిల కొట్టుకుంటూ.. వీడియో వైరల్..


  ఈ క్రమంలో హౌజ్ లో ఎవరు ఉండాలి.. ఎవరు ఉండకూడదు అన్నది ఆడియెన్స్ డిసైడ్ చేస్తున్నారు. ఇప్పటికే హౌజ్ లో ఉన్న 19 మందిలో ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆడియెన్స్ నెక్స్ట్ టార్గెట్ లో ఎవరు ఉన్నారన్నది హాట్ న్యూస్ గా మారింది. హౌజ్ లో టాస్క్ లు ఆడేవారు.. సెన్సిబుల్ గా ఉండేవారిని మాత్రమే హౌజ్ లో ఉంచుతున్నారు ఆడియెన్స్. ఊరకనే అరిచే వారు.. ఆట సరిగా ఆడని వారిని కూడా హౌజ్ నుండి బయటకు పంపిస్తున్నారు.

  ఈ క్రమంలో ఆడియెన్స్ నెక్స్ట్ టార్గెట్ లో సిరి, అనీ, ప్రియాంక, ప్రియ మరియు జశ్వంత్ ఉన్నారని తెలుస్తోంది. వీరి కంటే ముందు లోబో సీక్రెట్ రూంను ఎలా ఉపయోగించుకుంటాడు.. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఎలా ఆడుతాడు అనేది కాస్త ఆసక్తికరంగా మారింది.

  Photo Viral: ఆ బామ్మ చేసే పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఇంతకు ఆమె ఏం చేస్తుందో తెలుసా..


  అయితే లోబో నామినేషన్లోకి వస్తే మాత్రం అతడిపై కూడా ఎలిమినేషన్ కత్తి వేలాడుతుంది. ఇక హౌజ్ లో స్ట్రాంగ్ అనిపించుకుంటున్న కొంతమంది హౌజ్ మెట్స్ కూడా వారి టాస్క్ లు ఆడిన విధానాన్ని బట్టి హౌజ్ లో ఎన్నాళ్లు కొనసాగుతారో చూడాలి. ఇప్పటికే షో స్టార్ట్ అయ్యి ఆరు వారాలు అవుతుండగా హౌజ్ లో రానున్న రోజుల్లో ఆట మరింత రసవత్తరంగా కానుందని తెలుస్తోంది. ఇక చాలామంది శ్వేత ఎలిమినేట్ కావడానికి గల కారణం యాంకర్ రవి అంటున్నారు.

  రవి చెప్పినందుకే శ్వేత అలా చేసిందని చెబుతున్నారు. అయితే శ్వేతకు బయట ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా తక్కువ. ఫ్యాన్స్ వేసే ఒట్ల ఆధారంగానే ఆమె ఎలిమినేట్ అయిందని మరికొందరి వాదన. ఏదేమైనా టాస్క్ లు ఆడినా.. ఆడకపోయినా.. బయట ఫ్యాన్స్ సపోర్ట్ గట్టిగా ఉంటే.. హౌస్ లో ఉంటున్నారనేది తెలుస్తోంది. గత నాలుగు సీజన్ల నుంచి కూడా అదే కనిపిస్తోంది.
  Published by:Veera Babu
  First published: