Bigg boss 5 Telugu: బిగ్ బాస్ బిగ్ అప్డేట్ ఇచ్చేది ఆ తేదీ తర్వాతే.. ఇప్పటికే పనులు అన్నీ పూర్తీ?

bigg boss season 5 telugu

Bigg boss 5 Telugu: బుల్లితెరలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్. ఎన్నో భాషలలో ప్రసారమౌతున్న ఈ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తెలుగులో ఇప్పటికి 4 సీజన్ లు పూర్తి అవ్వగా త్వరలో సీజన్ 5 ప్రసారం కానుంది.

  • Share this:
    Bigg boss 5 Telugu: బుల్లితెరలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్. ఎన్నో భాషలలో ప్రసారమౌతున్న ఈ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తెలుగులో ఇప్పటికి 4 సీజన్ లు పూర్తి అవ్వగా త్వరలో సీజన్ 5 ప్రసారం కానుంది. ఇక ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మరో లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది.

    ఇప్పటికే ఈ సీజన్ కోవిడ్ కారణంగా వాయిదా పడుకుంటూ వస్తుంది. గత ఏడాది సీజన్ 4 ఆలస్యం కావడంతో సీజన్ 5 త్వరగా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అయ్యింది. ఇక తాజాగా ఈ షో సెప్టెంబర్ 5 న ప్రారంభమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జూమ్ ద్వారా కంటెస్టెంట్ లను ఎంపిక చేసినట్లు తెలియగా ఇటీవలే వాళ్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి.

    ఆగష్టు లో ఈ షో లోగో లాంచ్ చేయనున్నారట. ప్రోమో షూట్ కూడా ఉంటుందని టాక్. ఇక 18 మంది కంటెస్టెంట్ లను షో ఓపెనింగ్ డే రోజు నుండి పంపడానికి ఏర్పాట్లు కూడా చేశారట. లిస్ట్ ప్రకారం కంటెస్టెంట్స్ లను ఆగస్టు 15 తర్వాత క్వారంటైన్ కి పంపుతారని తెలిసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 5న హౌస్ లోకి పంపిస్తారని సమాచారం. ఇక ఈ సీజన్ ను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసారని గతంలో ప్రకటించారు. అంతే కాకుండా కొన్ని రూల్స్ కూడా పెట్టారట. మొత్తానికి సెప్టెంబర్ 5 న షో ప్రారంభం కానుంది.

    bigg boss season 5 telugu

    ఇక ఈ సీజన్ లో ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రెటీలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈసారి హోస్టింగ్ చేయడానికి గతంలో నాగార్జున పేరు వినిపించగా మళ్లీ ఆయన స్థానంలో మరో యంగ్ హీరో రానా హోస్టింగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను కూడా ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూని సీజన్ 4 కంటెస్టెంట్ సోహెల్ చేయనున్నట్లు మొదట్లో ప్రకటించగా తాజాగా మరో కంటెస్టెంట్ బోల్డ్ బ్యూటీ అరియానా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలిసింది.
    Published by:Navya Reddy
    First published: