BIgg Boss 5 Telugu Sarayu: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమవ్వగా ఈసారి ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. అందులో అందరూ చాలావరకు పరిచయమున్న కంటెస్టెంట్ లే పాల్గొని హౌస్ లోని తమ సందడిలను, రచ్చలను మొదలుపెట్టారు. మొత్తానికి ఈ సీజన్ మొదటి రోజు నుంచి బాగా హైలెట్ గా మారింది. పరిచయాలు పెంచుకోవడం, గొడవలకు దిగడం మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం ఇలా మొత్తం బాగానే సాగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో కంటెస్టెంట్ సరయు.. షో లోనే షాకింగ్ కామెంట్స్ చేసింది.
యూట్యూబ్ లో బూతు మాటలతో రెచ్చిపోతూ అందరితో తెగ ట్రోల్స్ ఎదుర్కొనే సరయు.. మొత్తానికి తన బూతు మాటల ద్వారా సెలబ్రిటీ హోదాను అందుకొని బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది. బయట తన మాటలతో తూటాలు పేల్చే సరయు హౌస్ లోకి అడుగుపెట్టక తన బూతు మాటలు బాగా అదుపులో పెట్టుకుంటుంది. ఇదిలా ఉంటే మొదటి వారం చివరి రోజు కావడంతో నాగార్జున వచ్చి సందడి చేయడం.. ఎలిమినేట్ లిస్టులో ఉన్న వారిని ఎలిమినేట్ చేయడం వంటివి చేస్తాడు.
ఇక దీనితో ఈ ఎపిసోడ్ పూర్తికాగా.. అందులో కొన్ని ఓపెన్ కామెంట్స్ చేసింది సరయు. ఇక నాగార్జున సరయును.. హౌస్ లో బూతులు మాట్లాడటం లేదు ఏంటి అని ప్రశ్నించగా మీరు తిడతారని మాట్లాడటం లేదు సార్ అంటూ లేదంటే నా సామిరంగా అంటూ సమాధానమిచ్చింది. వెంటనే నాగార్జున నువ్వు నీలా ఉండమ్మా అంటూ.. అని ఇన్ డైరెక్టుగా బూతుల పురాణం విప్పు అన్నట్లు ఓపెన్ గా చెప్పాడు నాగార్జున.
ఇది కూడా చదవండి:యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ మధ్య గొడవలు.. చిన్నమాటకు పెద్దగా.. ఎందుకో ఇంత?
ఇక సరయు వెంటనే మీరు నన్ను డేట్ కి తీసుకెళ్తాను అంటే.. బూతులు మొదలు పెడతా అని తను కూడా కామెంట్స్ చేసింది. ఇక నాగార్జున నిన్ను డేట్ కి తీసుకొని వెళ్లాలంటే ముందు బయటకు రావాలి కదా అని అన్నాడు. ఇప్పుడు కాదులెండి సార్ వంద రోజుల తర్వాత డేట్ కి వెళ్దామని చెప్పింది సరయు. అయితే సరయు ఈరోజే ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక వంద రోజుల తర్వాత డేట్ అనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor ravi, Bigg Boss 5 Telugu, Hamidha, Jessie, Manaas, Nagarjuna Akkineni, Sarayu