Abijeet: స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షో కి వచ్చి భారీ ఫెమ్ సంపాదించిన వారిలో అభిజీత్ ఒకరు. ఈ షో తో భారీ స్థాయిలో ఆఫర్స్ అందుకొని బిజీగా మారారు ఎంతోమంది. ఇక ఈ నేపథ్యంలోనే భారీ ఫెమ్ సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజీత్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులకు దగ్గర ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తన అనుభవాలను నెటిజెన్లతో పంచుకున్న అభిజీత్ ప్రస్తుతం జుట్టుకు సంబంధించి కొన్ని చిట్కాలు ఇచ్చాడు.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అభిజీత్ కు ఆతర్వాత ఊహించిన స్థాయిలో హిట్స్ రాలేదు. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు సినిమాలతో బిజీ ఉన్న అభిజీత్ కు ఇప్పుడు కాస్త సమయం దొరికింది.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టుకున్నాడు అభిజీత్. తాజాగా తన ఇన్స్ స్టా గ్రామ్ వేదిక ద్వారా అభిమానులతో ముచ్చటించగా.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఇక కొందరు వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించగా ఓ నెటిజన్ మాత్రం జుట్టు ఊడిపోతుంది? ఏమైనా టిప్స్ ఇవ్వగలరు? అంటూ ప్రశ్నించాడు. దీనికి వెంటనే అభిజిత్ కూడా స్పందించాడు. జుట్టు ఊడిపోవడం అనేది ప్రపంచమంతా ఉన్న సమస్య.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి, మంచి హెయిర్ ప్రొడక్ట్స్ వాడండి అంటూ సలహాలు ఇచ్చాడు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.